నేత్రదానం చేస్తే.. మరణించినా బతికే ఉంటామంటోన్న హాస్య బ్రహ్మ

Published : Oct 01, 2020, 09:20 PM IST

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నేత్రదానానికి సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు నేత్రదానం చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆయన క్యాంపెయిన్‌ ప్రారంభించారు. నేత్రదానం వల్ల మనం చనిపోయి బతికే ఉంటామన్నారు.   

PREV
14
నేత్రదానం చేస్తే.. మరణించినా బతికే ఉంటామంటోన్న హాస్య బ్రహ్మ

కార్యా అంధత్వ ముక్త భార్గ్ అభియాన్‌ ద్వారా `సాక్ష్యం సేవ ఆర్గనైజేషన్‌` చేస్తున్న నేత్ర దాన అవగాహన కార్యక్రమంలో బ్రహ్మానందం భాగమయ్యారు. నేత్రదానం వల్ల ఒక్కొక్కరు మరో ఇద్దరికి చూపుని ఇచ్చి, వారి జీవితంలో వెలుగులు నింపిన వారవుతారని పేర్కొన్నారు. 

24

సర్వేంద్రియానాం నయనం ప్రదానం అంటారు. అంటే అన్ని అవయవాల్లో నయనాలు చాలా ప్రధానమైనవని అర్థం. కళ్లతో చూడగలుగుతాం.. కళ్లతో మాట్లడగలుగుతాం. కళ్లతో మనలో కలిగిఏ ప్రతి భావాన్ని వ్యక్తీకరించగలం. అనంత సృష్టిలో ఉన్న ప్రతి దానికి కళ్లతో చూసి ఆనందించగలిగేటటువంటి ఓ అద్భుతమైన ఒక వరాన్ని భాగవంతుడు మనకు ప్రసాదించాడు. మనం నేత్రదానం చేసినట్టయితే మరణించిన తర్వాత మన కళ్ళు వృధా కాకుండా, మనం ఇచ్చే రెండు కళ్లు నలుగురికి ఉపయోగపడతాయన్నారు. 

34

చనిపోయిన తర్వాత వ్యర్థ  పదార్థంలాగా మట్టిలో కలిసిపోవడం కంటే, మనలో ఉన్న అవయవాలు ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయంటే, అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ఎన్నో దానాలు చేస్తూ ఉంటాం. ఎన్నో దానాలు చేశామని చెప్పుకుంటాం. గుండె ఒక్కటి ఉంటే చేయగలిగింది ఏమీ లేదు. ఈ నేత్రదాన కార్యక్రమంలో ప్రతి విలేజ్‌కి.. ఇప్పటికే 350 విలేజెస్‌లో నేత్రదాన కార్యక్రమం నిర్వహిస్తూ.. కావాల్సిన నెట్‌ వర్క్ కూడా వాళ్లకి ఏర్పాటు చేస్తూ.. ఇంకా ఎంతో అభివృద్ది చేయాలనే ఆలోచన సాక్ష్యం ఆర్గనైజేషన్‌కు రావడం.. హ్యాట్సాఫ్ అని బ్రహ్మీ చెప్పారు. 

44

ప్రతి ఒక్కరు తన ఆలోచనా విధానాన్ని మార్చుకుని నేత్రదానంకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన సాటివాళ్లకి ఉపయోగపడుదాం. వారికి కనుచూపినిద్దాం. వాళ్ళు సృష్టిలో ఉన్న జీవరాసులన్నింటిని, అందాలను చూసేటటువంటి  అవకాశాన్ని కల్పిద్దాం. కళ్లతో చూడగలిగే వారందరూ బాగుంటే మనమూ బాగుంటాం. మనం బాగుంటే, దేశం బాగుంటుంది` అని అన్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories