జగన్‌కి రాజకీయ అవగాహన లేదు.. `జనతా గ్యారేజ్‌` టైమ్‌లో బాధపడ్డాః `బిగ్‌బాస్‌ 4` సోహైల్‌

First Published Oct 1, 2020, 8:00 PM IST

నటుడు సోహైల్‌.. ప్రస్తుతం `బిగ్‌బాస్‌4` తర్వాత బాగా పాపులర్‌ అయ్యాడు. మొన్న షోలో ఓ వైపు అభిజిత్‌, మరోవైపు అరియానాలపై ఫైర్‌ అయి హైలైట్‌ అయ్యారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై షాకింగ్‌ కామెంట్స్ చేశారు. 

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంచి నాయకుడని, ఆరోగ్య శ్రీ వంటి అనేక మంచి పథకాలు తీసుకొచ్చారని, తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని జగన్‌ మొండితనంతో పదేళ్ళు పోరాడి సీఎంఅయ్యాడని తెలిపారు. అయితే మొదట్లో జగన్‌కి రాజకీయాలపై అవగాహన లేదని, ఈ పదేళ్ళలో మంచి పట్టు సంపాదించాడని చెప్పారు.
undefined
ఫస్ట్ టైమ్‌ కొద్ది పాటి తేడాతో ఓడిపోయాడని, జనం కోసం ఏదో చేయాలనే తపనే ఆయన్ని గెలిపించిందన్నారు. పాదయాత్ర ద్వారా జనాల్లో నమ్మకం కలిగించాడని, ఎంతో కష్టపడ్డాడని చెప్పారు. జగన్‌ సీఎం అయిన తర్వాత ప్రధానంగా వైద్యం, విద్యపై దృష్టిపెట్టారని, ఎవరికైనా వైద్యం, విద్య చాలా ముఖ్యమని, ఆ విషయంలో జగన్‌ నిబద్దతతోపనిచేస్తున్నారన్నారు.
undefined
ఇప్పుడు ఫ్రీ ఎడ్యూకేషన్‌తోపాటు ఇంగ్లీష్‌ మీడియం అందిస్తున్నారు. ఆయా స్కూల్స్ ప్రైవేట్‌ స్కూల్స్ మాదిరిగా క్వాలిటీగా ఉన్నాయన్నారు. వైద్యం పరంగా ఇటీవలేఅంబులెన్స్ లో ప్రారంభించారు. కరోనా సమయంలోనూ బాగా డీల్‌ చేస్తున్నారని, దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యధిక కరోనా టెస్ట్ లు చేశారు. ప్రతి ఒక్కరికి బెడ్‌ అందేలాచూస్తున్నారు. బెడ్‌ లేదంటే అర్థగంటలో చర్యలు తీసుకుంటామని సవాల్‌ విసిరాడు. ఇలా నాకు ఆయన స్ఫూర్తిగా నిలిచారన్నారు.
undefined
తెలంగాణలో హరీష్‌ రావు గొప్ప లీడర్‌ అని, ఆయన తన పాపని కాపాడారన్నారు. ఆ టైమ్‌లో ఫోటో తీసుకుంటానని అడితే, ఫోటో తర్వాత ఫస్ట్ పాపని కాపాడుకో అన్నారు. ఆతర్వాత కేటీఆర్‌ యంగ్‌ టాలెంటెడ్‌ లీడర్‌. ఐటీకి జెమ్‌ ఆయన. ఆయనకు యూత్‌లో భారీ ఫాలోయింగ్‌ ఉందన్నారు.
undefined
ఇక తన కెరీర్‌ గురించి చెబుతూ, తాను మొదట ఎన్టీఆర్‌ నటించిన `జనతా గ్యారేజ్‌`లో చిన్న పాత్రలో కనిపించానని, కాకపోతే తన పాత్రని కొంచెమే చూపించారని, అందుకుతాను చాలా బాధపడ్డాడట. `నాతి చరామి` తన ఫస్ట్ సీరియల్‌ అని, అది తనకు నటుడిగా గుర్తింపు తెచ్చిందన్నారు.
undefined
`కృష్ణవేణి` సీరియల్‌ మరింత పాపులర్‌ చేసిందన్నారు. `యురేక` సినిమాలో నటించానని, పబ్లిసిటీ లేక ఆ సినిమా ఆడలేదని, తనకు అంతగా గుర్తింపురాలేదన్నారు. సినిమాల్లో కంటే టీవీనే తనకు పాపులారిటీ తెచ్చిందన్నారు. అయినా జగన్మోహన్‌ రెడ్డిలాగా పోరాడతానని చెప్పారు.
undefined
click me!