సిల్క్ స్మిత వెండి తెరపై ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ఆమె జీవితం అంత విషాదకరంగా ముగిసింది. 35 ఏళ్ళ చిన్న వయసులోనే సిల్క్ స్మిత మరణించారు. ఇప్పటికీ సిల్క్ స్మిత మరణం ఒక మిస్టరీనే. వెండి తెరపై సిల్క్ స్మిత ఎలాంటి పాత్రలు చేసినా రియల్ లైఫ్ లో మాత్రం మంచి మనసున్న వ్యక్తి అట. కష్టాలు దాటుకుని సిల్క్ స్మిత గ్లామరస్ నటిగా ఎదిగింది.