రామ్ చరణ్ కొత్త సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్ హీరో కీ రోల్ ?

Published : Dec 11, 2024, 08:46 AM IST

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న కొత్త స్పోర్ట్స్ డ్రామా సినిమా గురించి చర్చ జరుగుతుంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతి బాబు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

PREV
15
 రామ్ చరణ్ కొత్త సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్ హీరో  కీ రోల్ ?
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani


ఒక్క సినిమాతోనే ప్రముఖ దర్శకుల లిస్ట్ లో చేరిన బుచ్చిబాబు కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన  దర్శకత్వంలో తాజాగా రామ్ చరణ్ హీరోగా ఓ  రూపొందుతోంది.  ఈ సినిమాకు సంబంధించి మీడియాలో అప్డేట్స్ లేకపోయినా గాసిప్స్,వార్తలు రెగ్యులర్ గా  వస్తూనే ఉన్నాయి.

పుష్ప రిలీజ్ తర్వాత రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో పాటు ఈ సినిమా కూడా ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఈ ప్రాజెక్టు  సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతుండగా, పాన్-ఇండియన్ స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతోంది.

25
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani


రామ్‌ చరణ్‌తో బుచ్చిబాబు రూపొందిస్తున్న  మూవీ ఒక స్పోర్ట్స్‌ డ్రామా అనే విషయాన్ని ఇప్పటికే మేకర్స్‌  క్లారిటీ ఇచ్చారు.  RC16 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్ర షూటింగ్ రీసెంట్ గా ప్రారంభం అయ్యింది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో మల్లయుద్ధం కథతో ఉంటుందని వార్తలు వస్తున్నాయి.  

ఈ మూవీలో రామ్‌చ‌ర‌ణ్ స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అందుకోసం చ‌ర‌ణ్ త‌న బాడీని బిల్డ్ చేసుకున్నారు. అలాగే ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ ని తీసుకు వస్తున్నారని సమాచారం.

35
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani


ఆ సూపర్ స్టార్ మరెవరో కాదు...సల్మాన్ ఖాన్. రామ్ చరణ్,  సల్మాన్ ఖాన్ మధ్య మంచి ప్రెండ్షిప్ ఉంది. ఆ క్రమంలోనే సల్మాన్ ఖాన్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు, ఆ పాత్రకు ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా చేసారు సల్లూ భాయ్.

అలాగే  సల్మాన్ ఖాన్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు చిరంజీవి అతనికి అతిథ్యమిస్తారు. ఇప్పుడు, కీలకమైన పాత్ర కోసం సల్మాన్ ఖాన్‌ను తీసుకోవాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారు, 

45
Ramcharan, #BuchiBabu, uppena,Shiva Rajkumar


సినిమా విశేషాలకు వస్తే...స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో గ్రామీణ నేపథ్యాన్ని ప్రధానంగా చూపించనున్నారు. సినిమా కథలో భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉంటుంది. మైసూరులో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో గ్రామీణ నేపథ్యానికి అనుగుణంగా మరో ప్రత్యేక సెట్ను నిర్మించారు, అక్కడ ఎక్కువ శాతం  షూటింగ్ జరుగనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, కథానాయికగా జాన్వీ కపూర్ ఎంపికయ్యారు. ప్రముఖ నటులు శివరాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

55

ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ముఖ్య ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తున్నారు. అలాగే చిత్రానికి "పెద్ది" అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సంబంధించి అధికారిక తేదీ ఇంకా ప్రకటించలేదు, కానీ సంక్రాంతి 2025 నాటికి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. 

click me!

Recommended Stories