కమెడియన్ అలీ గతంలో 2వ పెళ్లి చేసుకున్నట్లు జరిగిన ప్రచారంపై ఆయన భార్య జుబేదా స్పందించారు. ఆ ప్రచారం వల్ల అలీ ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అయ్యారో ఈ కథనంలో తెలుసుకోండి.
కమెడియన్ అలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి టాలీవుడ్ లో తిరుగులేని కమెడియన్ గా ఎదిగారు. హీరోగా కూడా నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. దశాబ్దాలుగా అలీ కమెడియన్ గా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. చిత్ర పరిశ్రమలోని నటీనటులకు రూమర్స్ బెడద తప్పదు. అలీ కూడా రూమర్స్ బాధితుడే. తన గురించి వచ్చిన రూమర్ వల్ల ఫ్యామిలీ ఏ విధంగా ఎఫెక్ట్ అయిందో అలీ, అతడి భార్య జుబేదా ఇద్దరూ ఇంటర్వ్యూలో తెలిపారు.
25
16 ఏళ్ళ వయసులోనే పెళ్లి
రీసెంట్ గా అలీ భార్య జుబేదా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అలీ రెండో పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అసలేంటి అని ప్రశ్నించగా ఆమె బదులిచ్చారు. నాకు 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే అలీ గారితో పెళ్లి జరిగింది. ఆయన యాక్టర్ కావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. పెళ్ళైన ఏడాది తర్వాత పుట్టింట్లో కొన్ని రోజులు ఉండడం కోసం వెళ్ళాను. మా నాన్న నన్ను తీసుకుని వెళ్లారు.
35
అలీ రెండో పెళ్లి వార్త
ట్రైన్ లో ఆయన ఒక మ్యాగజైన్ కొన్నారు. అందులో అలీ గారికి, నటి శుభశ్రీకి పెళ్లి జరిగినట్లు ఫోటోతో సహా వార్త ఉంది. అలీ రెండో పెళ్లి చేసుకున్నాడు అని రాసి ఉంది. నాన్న కంగారు పడ్డారు. కానీ నాకు వెంటనే చెప్పాలి. ఇంటికి వెళ్ళాక మనం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. బయలుదేరు అని అన్నారు. ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్లిపోవాలా.. కుదరదు నేను కొన్ని రోజులు ఉంటాను అని చెప్పా. లేదు వెళ్లాల్సిందే అని అసలు విషయం చెప్పారు.
వామ్మో పేపర్ లో వచ్చేసింది అంటే నిజమే అయి ఉంటుంది అని భయపడ్డాను. ఏడుస్తూ తిరిగి హైదరాబాద్ బయలుదేరా. ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొడితే మా అత్తగారు ఆశ్చర్యపోయారు. అలీ గారు అప్పుడు షూటింగ్ కోసం బయలుదేరుతూ నిన్న వెళ్లి అప్పుడే వచ్చేశావు ఏంటి అని అడిగారు. అమ్మాయి ఎందుకనో ఏడుస్తోంది అందుకే తీసుకుని వచ్చా అని చెప్పారు. అసలేం జరిగింది చెప్పండి అని అడిగితే నాన్న మ్యాగజైన్ చూపించారు.
55
ఆయనపై నమ్మకం, అందుకే భయపడ్డా
ఇదా సంగతి.. నేను, శుభశ్రీ సినిమాలో నటిస్తున్నారు. అది పెళ్లి సీన్ లో ఉండే ఫోటో. ఎవరో లీక్ చేసినట్లు ఉన్నారు అందుకే మ్యాగజైన్ లో వచ్చింది అని అయన చెప్పారు. అప్పుడు మనసు కుదుట పడింది అంటూ జుబేదా వివరించారు. మా ఆయనపై నాకు నమ్మకం ఎక్కువ.. ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు అంటే నేను ముందు అస్సలు నమ్మలేదు. చివరికి మ్యాగజైన్ చూపించడంతో అందులో నిజం ఉంటుంది కదా అని భయపడినట్లు జుబేదా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అలీ.. అలీతో సరదాగా షోకి శుభశ్రీ వచ్చినప్పుడు రివీల్ చేశారు.