గబ్బర్ సింగ్ అంత పెద్ద విజయం, కానీ అది మన చేతుల్లో లేదు.. ఉస్తాద్ భగత్ సింగ్ పై అలీ కామెంట్స్

Published : Mar 30, 2026, 07:45 PM IST

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై కామెడీ అలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో అలీ లేకుండా పవన్ సినిమా ఉండేది కాదు. 

PREV
15
Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఉగాది కానుకగా విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తోంది. అయితే ఆడియన్స్ నుంచి ఆశించిన రెస్పాన్స్ మాత్రం రావడం లేదు. అయితే అభిమానులని మెప్పించేలా డైరెక్టర్ హరీష్ శంకర్ కొన్ని సన్నివేశాలు పెట్టారు. వాటిని కొంత వరకు ఎంజాయ్ చేస్తున్నారు.

25
బాక్సాఫీస్ వద్ద ఎదురీత

కానీ గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేంతలా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణించడం లేదు. 11 రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా దాదాపు 55 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఈ చిత్రం ఇంకా 75 కోట్ల వరకు షేర్ రాబట్టాలి. మొత్తానికి ఉస్తాద్ కి బాక్సాఫీస్ వద్ద ఎదురీత తప్పడం లేదు.

35
పవన్, అలీ మధ్య పాలిటిక్స్ వల్ల గ్యాప్

గతంలో పవన్ కళ్యాణ్ సినిమా అంటే కమెడియన్ అలీకి ఒక పాత్ర తప్పనిసరిగా ఉండేది. అయితే పవన్, అలీ మధ్య పాలిటిక్స్ వల్ల గ్యాప్ వచ్చింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. పవన్ బహిరంగంగా అలీని విమర్శించడం.. ఆ తర్వాత అలీ కౌంటర్ ఇవ్వడం జరిగింది.

45
హరీష్, పవన్ కాంబినేషన్

ఆ తర్వాత వచ్చిన పవన్ సినిమాల్లో అలీ కనిపించలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అలీకి పవన్ కళ్యాణ్ గురించి, ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ప్రశ్న ఎదురైంది. ఉస్తాద్ రిలీజ్ కి ముందు జరిగిన ఇంటర్వ్యూ ఇది. ఉస్తాద్ మూవీ గురించి అలీ మాట్లాడుతూ.. హరీష్, పవన్ కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. తొలి చిత్రం గబ్బర్ సింగ్ ఎంత పెద్ద విజయం సాధించిందో ఇది కూడా ఆ రేంజ్ హిట్ కావాలి అని కోరుకుంటున్నా అని అలీ అన్నారు.

55
అది మన చేతుల్లో లేదు

ఈ మూవీలో మీరు కూడా ఉంటారు అని మేమంతా ఆశించాం, కానీ మీరు లేరు అని అడగగా.. అలీ అది మన చేతుల్లో లేదు అన్నట్లుగా సైగ చేశారు. మొత్తంగా అలీ కోరుకున్నట్లు ఈ మూవీ గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ అయితే కాలేదు.

Read more Photos on
click me!

Recommended Stories