షూటింగ్‌ గ్యాప్‌లో అలీ ఫస్ట్ నైట్‌.. అయ్యో పాపం స్టార్‌ కమెడియన్‌కి ఏంటీ పరిస్థితి.. కేవలం రెండు గంటలే!

Published : Oct 29, 2022, 11:06 AM ISTUpdated : Oct 29, 2022, 11:53 AM IST

బ్రహ్మానందం తర్వాత ఆ స్థాయిలో హాస్యనటుడిగా పేరుతెచ్చుకున్న అలీకి సంబంధించిన ఓ సీక్రెట్‌ రివీల్‌ అయ్యింది. ఆయన ఫస్ట్ నైట్‌ ఎలా జరిగిందనేది ఒక రహస్యం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

PREV
16
షూటింగ్‌ గ్యాప్‌లో అలీ ఫస్ట్ నైట్‌.. అయ్యో పాపం స్టార్‌ కమెడియన్‌కి ఏంటీ పరిస్థితి.. కేవలం రెండు గంటలే!

కమెడియన్‌ అలీ టాలీవుడ్‌లో వెయ్యికిపైగా చిత్రాల్లో నటించి దిగ్గజ కమెడియన్‌ గా నిలిచారు. బాల నటుడి నుంచి కెరీర్‌ని ప్రారంభించి నాలుగు దశాబ్దాలకుపైగా నటుడిగా రాణిస్తున్నారు, తనదైన హాస్యంతో మెప్పిస్తున్నారు. తొలి తరం హీరోల నుంచి, ఇప్పుడిప్పుడే వస్తోన్న అప్‌ కమింగ్‌ హీరోల వరకు అందరితోనూ కలిసి నటించారు. ఇప్పటికీ నటిస్తున్నారు. 
 

26

తాజాగా అలీకి సంబంధించిన ఓ రహస్యం బయటపడింది. ఆయన ఫస్ట్ నైట్ ఎలా జరిగిందో వెల్లడించారు నరేష్‌. పవిత్రలోకేష్‌ ముందే అలీ ఫస్ట్ నైట్‌ విషయాలను చర్చించడం గమనార్హం. ఇదిప్పుడు హాట్‌ టాపిక్‌గా మారడంతోపాటు ఈ వీడియో వైరల్‌ అవుతుంది. మరి ఆ సంగతులేంటనేది చూస్తే, ప్రస్తుతం అలీ, నరేష్‌, పవిత్ర లోకేష్‌ వంటి వారు కలిసి `అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి` అనే చిత్రంలో నటించారు. ఇది శుక్రవారం(అక్టోబర్‌ 28)న విడుదలై పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది.
 

36

అయితే అలీ, పవిత్ర లోకేష్‌, నరేష్‌ కలిసి ఓ చిట్‌చాట్‌ వీడియో చేశారు. ఈ వీడియోని విడుదల చేసింది యూనిట్‌. ఇందులో అలీ కి సంబంధించిన ఆసక్తికర విషయాలుండటం విశేషం. డిస్కషన్‌లో భాగంగా అలీ ఫస్ట్ నైట్‌ ప్రస్తావన వచ్చింది. ఓ సినిమా షూటింగ్‌ శంషాబాద్‌లో జరుగుతుందట. అందులో అలీ, మౌర్య జంటగా ఫస్ట్ నైట్‌ సీన్‌ నటిస్తున్నారట. అదే రోజు అలీ పెళ్లి రోజు. షూటింగ్‌లోనే కేక్‌ కట్‌ చేయిస్తామని తన భార్యని, ముగ్గురు పిల్లలను షూటింగ్‌కి తీసుకొచ్చారు దర్శక, నిర్మాతలు. 
 

46

ఓ వైపు మానిటర్‌లో పిల్లలు, తన భార్య షూటింగ్‌ చూస్తున్నారు, ఆ టైమ్‌లో అలీ ఫస్ట్ నైట్‌ సీన్‌ తీస్తున్నారట దర్శకుడు. పైగా ఆ ఫస్ట్ నైట్‌కి వాడింది కూడా తన మంచమేనని చెప్పారు అలీ. వాళ్లు చూస్తుండగా,ఆ ఫస్ట్ నైట్‌ సీన్‌ చేయడం చాలా ఇబ్బందిగా అనిపించిందని, దర్శకుడు తమపై కోపంతో కావాలని ఆ సీన్‌ ప్లాన్‌ చేసినట్టు ఉందని చెప్పారు. అంతేకాదు కావాలని తన మ్యారేజ్‌ డే రోజే ఆ సీన్‌ పెట్టడం, ఆ సమయంలోనే తమ ఫ్యామిలీని తీసుకురావడం తమపై జరిగిన కుట్రగా వర్ణించారు(సరదాగా) అలీ. పవిత్ర లోకేష్‌కి, నరేష్‌కి ఈ విషయాన్ని చెప్పగా, ఇది ఆద్యంతం నవ్వులు పూయించింది. 
 

56

ఈ క్రమంలో అలీ ఒరిజినల్‌ ఫస్ట్ నైట్‌ ప్రస్తావన తీసుకొచ్చాడు నరేష్‌. షూటింగ్‌ గ్యాప్‌లో ఫస్ట్ నైట్‌ చేసుకున్నావటగా? అంటూ కదిలించాడు నరేష్‌. దీంతో అలీ ఓపెన్‌ అయ్యాడు. అది 1994లో జనవరి టైమ్‌లో అని, తన మ్యారేజ్‌ జనవరి 22న అయ్యిందని, 23 రిసెప్షన్‌ చేసుకుని 24న హైదరాబాద్‌ బయలు దేరి వచ్చానని చెప్పారు అలీ. కె. రాఘవేంద్రరావు ఆ టైమ్‌లో `ముద్దుల ప్రియుడు` సినిమా షూటింగ్‌ చేస్తున్నాడని, దీంతో అర్జెంట్‌గా రావాలని ఫోన్‌ చేయడంతో వెంటనే తన భార్య, అమ్మని తీసుకుని హైదరాబాద్‌ వచ్చానని చెప్పాడు అలీ. 
 

66

దీనికి నరేష్‌ మరింత మసాలా యాడ్‌ చేస్తూ, ఆ రోజు రాఘవేంద్రరావుగారి సినిమా షూటింగ్‌లో అలీ పాల్గొన్నాడని, మధ్యలో రెండు గంటల షూటింగ్‌ బ్రేక్‌ దొరికితే ఆ టైమ్‌లో తన ఫస్ట్ నైట్‌ చేసుకున్నాడని, కేవలం రెండు గంటలే తన ఫస్ట్ నైట్‌ అంటూ సెటైర్లు పేలుస్తూ వెల్లడించారు నరేష్‌. పవిత్రకి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మరీ నరేష్‌ చెప్పడంతో పవిత్ర సిగ్గు మొగ్గేసింది. ఆ విషయాలు మనం పర్సనల్‌గా మాట్లాడుకుందాం అంటూ అంతటితో ఆ ఫస్ట్ నైట్‌ మ్యాటర్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టారు అలీ. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories