తెలుగు హీరోయిన్ చాందిని చౌదరికి పరిశ్రమలో జరిగిన అవమానం తెలిస్తే...!

First Published May 15, 2021, 8:07 AM IST

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా తెలుగు అమ్మాయిలు ఏలారు. 90లలో కూడా విజయశాంతి, రాధా, భానుప్రియ, రమ్యకృష్ణ వంటి తెలుగు హీరోయిన్స్ దే హవా. దర్శక నిర్మాతలు ముంబై అమ్మాయిలను హీరోయిన్స్ గా తెచ్చుకోవడం మొదలుపెట్టాక తెలుగు అమ్మాయిలకు పరిశ్రమలో కష్టాలు మొదలయ్యాయి.

గత 15ఏళ్లలో ఒక్క తెలుగు అమ్మాయి కూడా స్టార్ హీరోయిన్ కాలేదంటే అతిశయోక్తి కాదు. దానికి కారణం దర్శక నిర్మాతలు తెలుగు అమ్మాయిల పట్ల ఆసక్తి చూపకపోవడమే.
undefined
ఎంత అందంగా ఉన్నా తెలుగు అమ్మాయి అంటే చిన్నచూపు చూస్తున్నారు. దీనిపై ఇప్పటికే అనేక మంది తెలుగు అమ్మాయిలు ప్రత్యక్షంగా ఆరోణపలు చేసినా ఫలితం లేకుండా పోయింది.
undefined
అవకాశాలు ఇవ్వకపోగా పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అనేక అవమానాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న వర్ధమాన హీరోయిన్ చాందిని చౌదరి పరిశ్రమలో తాను ఎదుర్కొన్న సమస్యలను ఓ సందర్భంలో చెప్పడం జరిగింది.
undefined
హీరోయిన్ గా మారిన తరువాత కూడా చాందిని కలర్ పై కొందరు కామెంట్స్ చేశారట. నువ్వు ఏమంత కలర్ కాదు, నల్లగా ఉన్నావంటూ అవమానకర వ్యాఖ్యలు చేశారని చాందిని తెలియజేసింది.
undefined
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడానికి మన పరిశ్రమలో ఉన్న దర్శక నిర్మాతలు ఇష్టపడరని చాందిని చెప్పడం జరిగింది.
undefined
నటనపై ఆసక్తితో చాందిని చౌదరి షార్ట్స్ ఫిలిమ్స్ లో నటించడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఆమె లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. బ్రహ్మోత్సవం, లై వంటి చిత్రాల్లో చాందిని చిన్న చిన్న పాత్రలు చేశారు.
undefined
కొన్ని స్మాల్ బడ్జెట్ చిత్రాలలో ఆమె హీరోయిన్ గా చేయడం విశేషం. ఐతే గత ఏడాది విడుదలైన కలర్ ఫోటో మూవీ చాందినికి మంచి బ్రేక్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన కలర్ ఫోటో మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు చాందిని నటనకు ప్రశంసలు దక్కాయి.
undefined
ప్రస్తుతం చాందిని హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆమె నటించిన సూపర్ ఓవర్ సైతం ఓటిటి లో విడుదల కావడం విశేషం.
undefined
click me!