cm revanth reddy
ప్రస్తుతం టాలీవుడ్ కు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వేడి వాతావరణం నడుస్తోంది. ఈక్రమంలోనే దిల్ రాజు టీమ్ రేవంత్ రెడ్డితో చర్చలు కూడ జరిపారు. ఇండస్ట్రీ కి ప్రభుత్వానికి మధ్య సమన్వయం తీసుకువచ్చే ప్రయత్నంచేశారు. టాలీవుడ్ కు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ రాలేదు అని నిరూపించే ప్రయత్నం జరిగింది.
ఈక్రమంలో రేవంత్ రెడ్డి టాలీవుడ్ పై పగబట్టాడు అనే రాజకీయ విమర్శలకు చెక్ పెట్టేలా.. రేవంత్ రెడ్డి స్పందించారు. పరిశ్రమకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పారు. ఈక్రమంలో టాలీవుడ్ , రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ .. ఈ మూడు పేర్లు ప్రస్తుతం నెట్టింట భయంకరంగా వైరల్ అవుతున్నాయి.
అంతే కాదు.. ఈక్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అసలు సినిమాలు చూడరా..? చూస్తే.. ఆయన ఫ్యావరేట్ హీరో ఎవరై ఉంటారు... సినిమాల మీద రేవంత్ అబిప్రాయం ఏంటి అనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. అయితే రేవంత్ రెడ్డికి ఫేవరేట్ హీరో ఎవరు మరి..?
Revanth Reddy
రేవంత్ రెడ్డి రాజకీయాల్లో బిజీ అయిన తరువాత సినిమాలు చూడటం తగ్గించేశారట. ఇక సీఎం అయిన తరువాత అసలు సినిమాలు చూసే అవకాశం లేకుండా పోయంది. కాని గతంలో మాత్రం సినిమాలు ఎక్కువగానే చూసేవారట రేవంత్. ఈక్రమంలో గతంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి ఇష్టమైన హీరో గురించి రేవంత్ మాట్లాడారు.
ఆ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి తనకి ఇష్టమైన హీరో గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు ..అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ తనకి ఇష్టమైన హీరో అని ఆయన చెప్పారు .. కాలేజీ రోజుల్లో కృష్ణ సినిమాలు బాగా చూసేవాడ్ని అన్నారు. ఆతరువాత సినిమాలు పెద్దగా చూడటంలేదు అన్నారు రేవంత్. అందుకు సబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
CM Revanth Reddy
ఇక ఇండస్ట్రీకి సబంధించిన తాజా భేటీలో పలు సూచనలు చేశారు రేవంత్. భారీ ఎత్తున ఇండస్ట్రీ ఎదగడానికి తన సహకారం ఉంటుంది అన్నారు. మీరు ఏం చేసిన ఒకే.. కాని పబ్లిక్ పట్ల భాధ్యతగా ఉండండి చాలు అన్నారు. బెనిఫిట్ షోలు.. టికెట్ రేట్ల విషయంలో తన నిరణయం మారుదు అని అన్నట్టు తెలుస్తోంది. మరి ముందు ముందు ఈ విషయంలో ఆయన నిర్ణయం ఎలా ఉంటుంది అనేది చూడాలి.