వోడ్కా తాగి సమంత గురించి ట్వీట్ చేసిన ఆర్జీవీ.. కానీ!

First Published | Jul 26, 2020, 10:28 AM IST

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ, సినిమాలతో ఏ స్థాయిలో రచ్చ చేస్తాడో.. సోషల్‌ మీడియాలో అంతకు మించి రచ్చ చేస్తుంటాడు. నా ట్వీటర్‌ నా ఇష్టం అన్నట్టుగా వ్యవహరించే వర్మ, గతంలో సమంతను ఉద్దేశించి ఓ ట్వీట్ చేసి కాసేపటికే దాన్ని డిలీట్ చేశాడు. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

పెళ్లి తరువాత నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా మజిలీ. ఘన విజయం సాధించిన ఈ సినిమాలో సమంత, చైతన్య నటనకు సూపర్బ్‌ రెస్సాన్స్‌ వచ్చింది. అయితే ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ సందర్భంగా రామ్‌ గోపాల్ వర్మ కూడా స్పందించాడు.
undefined
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌ మరో కీలక పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసిన వర్మ తనకు సమంత కన్నా చైతన్యే ఎక్కువగా నచ్చాడని ట్వీట్ చేశాడు.
undefined
Tap to resize

`అవును.. నాగ చైతన్య నేను ఇంతకు ముందు ట్వీట్ చేసినప్పుడు 4వ పెగ్‌ వోడ్కా తాగుతున్నాను. కానీ వోడ్కాలో లేనప్పుడు నేను మరింత అద్వానంగా ఉంటాను. నేను సమంత కన్నా ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాను. కానీ నేను గేను కాదు. నేను నిజమే చెపుతున్నా.. సమంత కన్నా నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను` అంటూ ట్వీట్ చేశాడు వర్మ.
undefined
వర్మ చేసిన ఈ ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. కొద్ది క్షణాల్లోనే ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. కానీ కొద్ది సేపటికే వర్మ ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు. అక్కినేని కుటుంబంతో తనకు ఉన్న అనుబంధం కారణంగానే వర్మ ట్వీట్ డిలీట్‌ చేశాడని భావిస్తున్నారు.
undefined
అయితే వర్మ డిలీట్ చేయడానికి ముందే ఆ ట్వీట్‌ను చూసిన నాగ చైతన్య హుందాగా స్పందించాడు. వర్మ మీద ఎలాంటి ఎదురుదాడి చేయకుండా చాలా కూల్ గా రియాక్ట్ అయ్యాడు చైతూ.
undefined

Latest Videos

click me!