ఇక ఇప్పటికే ఈసినిమానుంచి విక్రమ్ లుక్ తో పాటు.. తంగలాన్ గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాను స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. 2డీ, 3డీ ఫార్మాట్లలో కూడా ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.