ఎపిసోడ్ ప్రారంభంలో ఎందుకు మీ చెల్లెలి మీద అబద్ధం చెప్పావు తను నీ పెళ్లి కోసం ఎంత తపన పడింది అలాంటిది నీ చెల్లెలు నిన్ను పట్టించుకోలేదని ఎలా చెప్తున్నావు. కలిసి పుట్టారు కలిసి పెరిగారు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అంటూ స్వప్న కి చివాట్లు లో పెట్టి వెళ్ళిపోతాడు రాజ్. చిట్టి కూడా కావ్య మీద అబద్ధం చెప్పినందుకు స్వప్నని మందలిస్తుంది. మరోవైపు అప్పు పిజ్జా డెలివరీ ఇవ్వడానికి ఒక షాప్ కి వెళ్తుంది.