ఇదిలా ఉంటే.. దీపికా పదుకొణె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కనిపిస్తారో తెలిసిందే. ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ సొట్టబుగ్గల సుందరి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఈక్రమంలో దీపికా ఏ పోస్టు పెట్టినా నెట్టింట క్షణాల్లోనే వైరల్ గా మారుతుంటుంది.