ఎపిసోడ్ ప్రారంభంలో ఏం జరిగిందో నిజం చెప్పు నువ్వు ఏం జరగలేదు అన్నా ఎక్కడ నమ్మే వాళ్ళు ఎవరు లేరు అంటుంది రుద్రాణి. నిజంగానే ఏమీ జరగలేదు అత్త అంటాడు రాజ్. నువ్వు చేసింది పాపమో,నేరమో కాదు ఇది సృష్టి ధర్మం తను నీ గదికి వచ్చినా, నువ్వు తన గదికి వెళ్లినా తను నీ భార్య కాబట్టి తప్పులేదు నిజం చెప్పు అంటుంది రుద్రాణి. ఆ పిల్ల అంటే ఇష్టం లేదు అన్నవాడివి తెల్లవారిసరికి ఆ గది నుంచి ఎందుకు బయటకు వచ్చావు అంటూ నిలదీస్తుంది అపర్ణ. అదే నాకు అర్థం కావడం లేదు అంటాడు రాజ్.