బ్లూ జంప్ సూట్ లో మృణాల్ ఠాకూర్ జబర్దస్త్ పోజులు.. స్లీవ్ లెస్ అందాలతో ఆటాడిస్తున్న నాని హీరోయిన్..

First Published | Mar 30, 2023, 12:15 PM IST

‘సీతారామం’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వెస్ట్రన్ లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో స్టన్నింగ్ ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది. తాజాగా మృణాల్ పంచుకున్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 
 

‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు ఎంతలా దగ్గరైందో తెలిసిందే. ప్రిన్స్ నూర్జహాన్, సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. తెలుగులో తొలి చిత్రంతోనే భారీ సక్సెస్ ను అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
 

మరోవైపు బాలీవుడ్ లోనూ వరుస చిత్రాలతో అలరిస్తూనే ఉంది. చివరిగా ‘సెల్ఫీ’లో స్పెషల్ సాంగ్ ద్వారా గ్లామర్ స్టెప్పులతో ఊర్రూతలూగించింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ - ఆదిత్య రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘గుమ్రాహ్‘ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 


ఏప్రిల్ 7న Gumraah  చిత్రం రిలీజ్ కానుండటంతో ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ సైతం ప్రచార కార్యక్రమాలో చురుకుగా పాల్గొంటోంది. ఈక్రమంలో నిన్న ఓ ఈవెంట్ లో పాల్గొన్న మృణాల్ ట్రెండీ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది.

బ్లూ జంప్ సూట్ లో మృణాల్ అద్బుతమైన లుక్ లో అట్రాక్ట్ చేసింది. ఈ వెస్ట్రన్ లుక్ లోనే ఫొటోషూట్ చేసింది. కిల్లింగ్ పోజులతో మతులు పోగొట్టింది. స్లీవ్ లెస్ అందాలతో ఆటాడించింది. బిగుతైన డ్రెస్ లో టాప్ గ్లామర్ షోతో కట్టిపడేసింది. 
 

మరోవైపు మత్తుపోజులు.. మైకం తెప్పించే చూపులతో ఇటు ఫ్యాన్స్ ను అటు నెటిజన్లను మంత్రముగ్ధులను చేసింది. దీంతో లైక్స్, కామెంట్లతో ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.  మృణాల్ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ ఏడాది ఏకంగా ఐదు చిత్రాల్లో నటిస్తోంది. అందులో మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో రెండు షూటింగ్ దశలో ఉన్నారు.  

తెలుగులో నాని సరసన Nani30లో నటిస్తోంది. మరిన్ని ప్రాజెక్ట్స్ లలోనూ అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అందులో మృణాల్ ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘ఆర్సీ16’లో అవకాశం దక్కించుకుందని అంటున్నారు.

వరుస ప్రాజెక్ట్స్ లతో మృణాల్ కేరీర్ లో దూసుకుపోతోంది. క్రేజీ ప్రాజెక్ట్స్ లలో అవకాశాలను అందుకుంటూ వస్తోంది. ప్రస్తుతానికి ఈ బ్యూటీ చూపు సౌత్ సినిమాలపైనే పడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఆఫర్లు ఉన్నాయని, అందుకే హైదరాబాల్ లో ఓ ఇల్లు కూడా కొనుగోలు చేసిందని తెలుస్తోంది.
 

Latest Videos

click me!