మేమిద్దరం లేకుండా అసలు ఈ కుటుంబమే లేదు అలాంటి మా మాటకి విలువ లేకుండా చేసావు నువ్వు. నిజంగా నీ కోడలు అంటే నీకు గౌరవం ఉంటే ఒక ఆడపిల్లని అర్ధరాత్రి పూట బయటికి గెంటేస్తే ఏం చేస్తున్నావు అంటుంది చిట్టి. అలా చేసింది నేను కాదు కదా రాజ్ కదా అంటుంది అపర్ణ. రాజ్ ఎవరు నీ కొడుకే కదా అంటుంది చిట్టి. వాడు ఆవేశంలో అలా చేస్తే ఆపవలసిన వివేకం, విచక్షణ నీకు లేవా అని అడుగుతుంది చిట్టి. అన్నింటికీ కారణం తప్పు నాదే అంటారా..