లావణ్యతో ప్రేమలో పడింది ఆ రోజే, ఇక పెళ్లి ఎప్పుడంటే... క్లారిటీ ఇచ్చేసిన వరుణ్ తేజ్!

Published : Aug 24, 2023, 08:57 AM IST

హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ ప్రేమ వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక లావణ్యతో ప్రేమ, పెళ్లి విషయాలపై వరుణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.   

PREV
16
లావణ్యతో ప్రేమలో పడింది ఆ రోజే, ఇక పెళ్లి ఎప్పుడంటే... క్లారిటీ ఇచ్చేసిన వరుణ్ తేజ్!


వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక విషయాలు వెల్లడించారు. 
 

26

గని మూవీ చేస్తున్నప్పుడు ప్రవీణ్ సత్తారు ఈ కథ వినిపించారు. నాకు కథతో పాటు ఎమోషన్, పాత్రలు నచ్చాయి. అందుకే చిత్రాన్ని ఒప్పుకున్నాను. సామాజిక బాధ్యత గుర్తు చేసే చిత్రం గాండీవధారి అర్జున. కొన్ని ఫైట్స్ రియలిస్టిక్ గా ఉంటాయి. అందుకే నాకు గాయాలు అయ్యాయి. 

36


గాండీవధారి అర్జున మూవీలో నా పాత్ర పేరు అర్జున్. బాడీగార్డ్ గా కనిపిస్తాను. ఏదో సందేశం ఇవ్వాలని మూవీ చేయలేదు. కథలో సందేశం అయితే ఉంది. కథ డిమాండ్ చేయడంతో లండన్ లో షూట్ చేశాము. దీని వలన అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయ్యింది. నిర్మాతలు వెనుకాడకుండా సినిమా నిర్మించారు. 

46


హీరోయిన్ సాక్షి వైద్య ప్రతిభ గల అమ్మాయి. మూడు పేజీల డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పడం ఆశ్చర్యం వేసింది. మిక్కీ జే మేయర్ మంచి సంగీతం అందించాడు. ప్రస్తుతం మాట్కా, ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాల్లో నటిస్తున్నాను. 
 

56

లావణ్యను చూసినప్పుడే నేను ప్రేమలో పడిపోయాను. అప్పుడే లవ్ మొదలైంది. ఇక మా పెళ్లి ఈ ఏడాది చివర్లో ఉంటుంది... అని వరుణ్ చెప్పుకొచ్చారు. 2017లో శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్ మూవీ విడుదలైంది. ఈ చిత్రంలో వరుణ్-లావణ్య జంటగా నటించారు. అప్పుడే వీరి రిలేషన్ మొదలు కాగా గోప్యంగా ఉంచారు.

66


2023 జూన్ 9న హైదరాబాద్ లో నాగబాబు నివాసంలో లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తో పాటు మెగా హీరోలు పాల్గొన్నారు. 
 

click me!

Recommended Stories