Ennenno Janmala Bandham: మాళవికను బయటకు పంపించే ప్రయత్నంలో వసంత్.. నిజం బయటపెట్టిన చిత్ర?

Published : Jun 22, 2023, 01:06 PM IST

Ennenno Janmala Bandham : స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతుంది. మాజీ భార్యని ఎలాగైనా వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్న మాజీ భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Ennenno Janmala Bandham: మాళవికను బయటకు పంపించే ప్రయత్నంలో వసంత్.. నిజం బయటపెట్టిన చిత్ర?

ఎపిసోడ్ ప్రారంభం లో వద్దన్నా వినకుండా భర్తల దగ్గర నుంచి కొబ్బరి బొండాలు తీసుకొని తాగేస్తారు సులోచన, మాలినిలు. తర్వాత మత్తులో అందరి మధ్యకి వెళ్లి డాన్స్ వేస్తారు. వాళ్లతో పాటు అందరూ కూడా డాన్స్ లో మునిగిపోతారు. ఆ తర్వాత సీన్లో ఖుషి దగ్గరకు వెళ్లి ఆదిత్య ఒక గిఫ్ట్ ఇస్తాడు.
 

29

ఖుషి ఆశగా ఓపెన్ చేయగా అక్కడ ఒక గుర్రపు బొమ్మ ఉంటుంది. థాంక్యూ అన్నయ్య నా పుట్టినరోజు రోజు నాకు ఇంకొక మాట కూడా ఇవ్వు. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండు ఎప్పుడూ నన్ను వదిలి వెళ్ళిపోవద్దు అని అంటుంది ఖుషి. నేను, మాళవిక అమ్మ వెళ్ళిపోయినా కూడా నిన్ను ఎప్పటికీ మర్చిపోను అని ఆదిత్య అంటాడు.
 

39

మీరు ఎక్కడికి వెళ్ళరు అందరూ కలిసే ఉందాము అని ఖుషి అంటుంది. ఈ మాటలన్నీ వింటారు వేద, యశ్ లు. భయపడొద్దు ఆదిత్య మనతోనే ఉంటాడు ఎక్కడికి వెళ్ళడు అని వేద కూడా యష్ తో అంటుంది. వాళ్ళ మాటలు వింటున్న మాళవిక, ఆదిత్య ఉంటాడు అంటే నేను కూడా ఉన్నట్టే కదా.
 

49

ఈ ఇంట్లోనే ఎలాగైనా స్థిరపడిపోవాలి అని అనుకుంటుంది. ఇంతలో కైలాష్, అభిమన్యులు ఖుషీ వాళ్ళని చూసి వాళ్ళ అందరి ప్రాణాలు వీళ్ళిద్దరి మీదే ఉన్నాయి. ఆదిత్య ని ఎలాగైనా కిడ్నాప్ చేసి వీళ్లను భయపెట్టాలి అని అనుకుంటారు. ఆ తర్వాత సీన్లో వసంత్, చిత్రలు మాళవిక దగ్గరికి వెళ్తారు.
 

59

అప్పుడు వసంత్, నువ్వు ఇలాగే ఇక్కడికి రావడం అందరికీ ఇబ్బందిగా ఉంది. బయటకు చెప్పలేకపోతున్నారు గాని అందరూ ఇబ్బందిగా ఉంటున్నారు నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవడం మంచిది అని అంటాడు. నేను వెళ్ళిపోతానని అన్నాను. 
 

69

మీరే బలవంతం గా ఇక్కడ ఉండమని చెప్పారు. నాకేమీ ఇంట్లో ఉండాలని లేదు అని అంటుంది మాళవిక. ఎక్కడ నువ్వు ఆదిత్యని ఇబ్బంది పడే స్థితికి తీసుకెళ్తావేమో అని భయంతో వాళ్ళ ఉంచుతున్నారు కానీ నీ గురించి కాదు. వాళ్ళ మనసులో ఇబ్బంది నాకు తెలుస్తుంది రేపే నేను ఇక్కడి నుంచి నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వసంత్. నేను ఇక్కడే పాతుకు పోదామని చూస్తుంటే వీడు నన్ను బలవంతంగా పంపించడానికి చూస్తున్నాడు. 

79

ఎలాగైనా ఈ యుద్ధంలో నేనే గెలావలి అని అనుకుంటుంది మాళవిక. ఆ తర్వాత సీన్ లో పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉంటారు. చాక్లెట్లు ఇస్తాము అని చెప్పి జోకర్ వేషం వేసుకున్న అభిమన్యు కైలాష్ లు ఆదిత్యని బలవంతంగా కారులోకి ఎక్కిస్తారు. ఇంతలో ఖుషి వచ్చి అడ్డుకుంటుంది. ఖుషి ఆదిత్యలిద్దరూ పోరాడుతున్న సమయంలో ఆదిత్య అక్కడి నుంచి పారిపోతాడు. అభిమన్యు కైలాష్ లు ఖుషి ని ఎత్తుకొని వచ్చేస్తారు.

89

ఖుషి కార్ ఎక్కడం పైనుంచి చూసి కంగారుపడుతుంది వేద. వెంటనే కార్ తీసి వాళ్ళు వెనకాతల వెళ్తుంది. మరోవైపు హాల్లో అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఆ కొబ్బరిబోండంలో మందు ఉన్నట్టు మాకేం తెలుసు? అంతా వసంత్ వల్లే వచ్చింది అని నవ్వుకుంటూ ఉంటారు. 
 

99

ఇంతలో ఆదిత్య వచ్చి ఖుషిని జోకర్ అంకుల్ తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పగా అందరూ బయటకు వచ్చి వెతుకుతారు. మరోవైపు వేద అభిమన్యు కార్ని వెంబడిస్తూ ఉంటుంది. యశ్ వాళ్ళు అక్కడ ఉన్న సమయంలో ఒక వాచీ కనిపిస్తుంది. ఆ వాచి చూసిన చిత్ర ఇది అభిమన్యుది అని అంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

click me!

Recommended Stories