మీ మెయిల్స్ ఓపెన్ చేయండి అని అంటుంది రేవతి. ఇంతలో మధుకర్, అలేఖ్య అటువైపు వెళ్తూ వీళ్ళ మాటలు వింటారు. మెయిల్స్ ఓపెన్ చేసిన కృష్ణ, మురారి ఆశ్చర్యపోతారు ఎప్పుడు సెలవు ఇవ్వని మాకు వారం రోజులు లీవ్ ఇచ్చారు ఏం అడిగేవమ్మా అని అడుగుతాడు మురారి. ఏదైతే ఏముంది మీరు వారం రోజులు పాటు మన గెస్ట్ హౌస్ కి వెళ్ళాలి అక్కడ హాయిగా గడిపిరండి రేపే బయలుదేరండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రేవతి. కృష్ణ, మురారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఆ తర్వాత సీన్లో గీతిక వాళ్ల నాన్నకు ఫోన్ చేస్తుంది.