క్యూట్ సెల్ఫీలతో కలవరపెడుతున్న ‘చిరుత’ హీరోయిన్.. ఆ విషయంలో నేహా శర్మ మరీ స్లో.!

First Published | Sep 19, 2023, 1:44 PM IST

‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ తెలుగు ప్రేక్షకులకు అలా పరిచయమై మాయమైపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సందడి చేస్తోంది. సోషల్ మీడియాలోనూ మెరుస్తూ ఆకట్టుకుంటోంది. 
 

యంగ్ బ్యూటీ నేహా శర్మ (Neha Sharma)  కెరీర్ టాలీవుడ్ తోనే ప్రారంభమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సరసన ‘చిరుత’లో నటించిన విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. 
 

ఇలా మొదటి సినిమానే భారీ స్థాయిలో చేసింది. తొలి చిత్రంతోనే హిట్ కూడా అందుకుంది. ఈ సినిమా 2007లో విడుదలైంది. నేహా తన గ్లామర్, నటన, డాన్స్ తో ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికిందని అనుకోగానే మాయమైపోయింది.
 


తెలుగులో ‘చిరుత’ తర్వాత ‘కుర్రాడు’ అనే సినిమా చేసింది నేహా. అంతే ఈ రెండు చిత్రాల తర్వాత మళ్లీ ఇటు వైపు చూడలేదు. ఇక్కడి నుంచి కూడా పెద్దగా ఆఫర్లు అందనట్టు కనిపిస్తోంది. దాంతో బాలీవుడ్ ఎక్కువగా సినిమాలు చేస్తూ వచ్చింది.
 

సౌత్ లో ఆ మధ్య మలయాళం, తమిళంలో ఒక్కో సినిమా చేసినట్టు కనిపించింది. ప్రస్తుతం తెలుగు సినిమాల క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నార్త్ నుంచి చాలా మంది హీరోయిన్లు టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. 

కానీ అప్పటికే మంచి క్రేజ్ దక్కించుకున్న నేహా శర్మ మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని కనిపిస్తోంది. హిందీ చిత్రాల్లోనే వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ సౌత్ లో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అభిమానులు, పలువురు అభిప్రాయపడుతున్నారు. 
 

కానీ ఆ విషయంలో మాత్రం నేహా మరీ స్లోగా కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తోంది. తన బ్యూటీఫుల్ ఫొటోలు, టూర్లు, వేకెషన్లకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసుకుంటోంది. తాజాగా ఓ రిస్టార్ట్ కు వెళ్లిన నేహా క్యూట్ సెల్ఫీలను పంచుకుంది. మరిన్నిపిక్స్ ను షేర్ చేసింది.
 

Latest Videos

click me!