ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. పుష్ప చిత్రంతో బన్నీ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. పుష్ప చిత్రంతో బన్నీ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ తన కెరీర్ లో అరుదైన మైలురాయి అందుకున్నారు.
26
అల్లు అర్జున్ నటుడిగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న మంగళవారం రోజుతో బన్నీ నటించిన తొలి చిత్రం గంగోత్రి విడుదలై 20 సంవత్సరాలు పూర్తయింది. దీనితో అల్లు అర్జున్ కి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు బన్నీని విష్ చేస్తూ కెరీర్ లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నారు.
36
తాజాగా మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. డియర్ అల్లు అర్జున్ నువ్వు ఇండస్ట్రీలో 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నావంటే చాలా సంతోషదాయకంగా ఉంది. నీ చిన్ననాటి జ్ఞాపకాలు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. సమయం ఎంత వేగంగా పయనిస్తోందో అనిపిస్తోంది. నీ ప్రయాణంలో నువ్వు ఐకాన్ స్టార్ గా, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగావు. రాబోవు రోజుల్లో నువ్వు మరిన్ని ఉన్నత శిఖరాలని చేరుకోవాలని కోరుతున్నా అంటూ చిరు ట్వీట్ చేశారు.
46
చిరంజీవి ట్వీట్ కి బన్నీ ఆసక్తికరంగా స్పందించారు. మీ ఆశీర్వాదానికి, శుభాకాంక్షలకి థాంక్యూ. మీపై నాలో గౌరవభావం, ప్రేమ ఎప్పటికి ఉంటాయి. థాంక్యూ చికబాబి అంటూ అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. చిరంజీవిని బన్నీ చికబాబి అని ముద్దుగా పిలుస్తుంటారు.
56
అయితే చిరంజీవి ట్వీట్ పై మెగా అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. చాలా కాలంగా అల్లు, కొణిదెల కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతూనే ఉంది. ఇటీవల మెగా పవర్ స్టార్ రాంచరణ్ బర్త్ డే వేడుకలు ఎంతో గ్రాండ్ గా జరిగాయి. సినీ రాజకీయ ప్రముఖులంతా రాంచరణ్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. కానీ అల్లు అర్జున్ మాత్రం చరణ్ బర్త్ డేకి చిన్న ట్వీట్ కూడా చేయలేదు.
66
దీనితో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయా అనే రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు చెబుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి మనసంటే ఇది అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ పర్సనల్ గా కూడా రాంచరణ్ కి బర్త్ డే విషెస్ చెప్పి ఉండొచ్చు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు అంతే.. అంటూ బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు.