పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత ఎదిగినా తన సోదరుడు చిరంజీవి, వదిన సురేఖ దగ్గర మాత్రమే ఒదిగి ఉంటాడు. పలు సందర్భాల్లో చిరంజీవి, సురేఖని పవన్ తల్లిదండ్రులుగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావడానికి చిరంజీవి పాత్ర ఎంత ఉందో సురేఖ పాత్ర కూడా అంతే ఉందని కుటుంబ సభ్యులు చెబుతుంటారు.