చిరంజీవి సినిమాకి కొత్త కష్టాలు? `విశ్వంభర` ఆ విషయంలో కంట్రోల్‌ తప్పుతుందా?

First Published | Sep 17, 2024, 5:20 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న `విశ్వంభర`కి ఊహించని కష్టాలు వెంటాడుతున్నాయి. డిజిటల్‌ రైట్స్ సగానికి పడిపోతే, బడ్జెట్‌ మరింత షాకిస్తుందట. 
 

మెగాస్టార్‌ చిరంజీవి `వాల్తేర్‌ వీరయ్య`తో  పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఇది తన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలవడం విశేషం. 250కోట్లకుపైగా వసూళ్లని రాబట్టినట్టు సమాచారం. దీనితో మెగాస్టార్‌ ఈజ్‌ బ్యాక్‌ అని అంతా అనుకున్నారు. ఆయన పాత్ర తీరుతెన్నులు గానీ, యాక్టింగ్‌గానీ, లుక్‌ వైజ్‌గానూ వింటేజ్‌ చిరంజీవి కనిపించారు. దీంతో ఆయన అభిమానులంతా పండగ చేసుకున్నారు. ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. చిరంజీవికి సరైన మూవీ పడితే ఏ రేంజ్‌లో ఉంటుందో `వాల్తేర్‌ వీరయ్య` నిరూపించింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి. యష్మి అసలు రూపం ఇదే
 

కానీ ఆ తర్వాత వచ్చిన `భోళా శంకర్‌` డిజప్పాయింట్‌ చేసింది. ఒక్కసారిగా ఆశలన్నీ తలక్రిందులు చేసింది. చిరంజీవికి స్పీడ్‌కి వెంటన బ్రేకులు పడ్డ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇప్పుడు చిరంజీవి `విశ్వంభర` సినిమాలో నటిస్తున్నారు. `బింబిసార` వంటి హిట్‌ మూవీని అందించిన వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ప్రస్తుత కాలానికి సోషియో ఫాంటసీ అంశాలను జోడించడంలో వశిష్ట దిట్ట. `బింబిసార`తోనే ఆ విషయం స్పష్టమైంది. ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న `విశ్వంభర` విషయంలోనూ అదే చేస్తున్నారు. `జగదేక వీరుడు అతిలోక సుందరి` సినిమా స్టయిల్‌లోనే దీన్ని తెరకెక్కిస్తున్నారట.  
 


ఆల్మోస్ట్ షూటింగ్‌ మేజర్‌ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించిన తాజగా ఆసక్తికర, షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. ఈ మూవీకి ఓటీటీ కష్టాలు మొదలయ్యాయట. సినిమాని కొనేందుకు ఓటీటీ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయట. అయితే తక్కువ రేట్‌ని కోట్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఎనభై, తొంబై కోట్ల వరకు ఆశించిన నిర్మాతలకు గట్టి షాక్‌ ఇస్తున్నాయట ఓటీటీ సంస్థలు. `విశ్వంభర` డిజిటల్‌ రైట్స్ కోసం 40కోట్లు కోట్‌ చేస్తున్నాయట ఓటీటీ సంస్థలు. అంటే నిర్మాతలు ఊహించిన దానికంటే సగమే. ఇదే ఇప్పుడు షాకిస్తుంది.
 

`విశ్వంభర` సినిమాని సుమారు 150కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారట. ఇందులో చిరంజీవికి జోడీగా త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. వీరితోపాటు భారీ కాస్టింగ్‌ ఉంది. ఆషికా రంగనాథ్‌, మృణాల్‌, సురభి, ఈషా చావ్లా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తుంది. ఐదుగురు హీరోయిన్లు అంటే గ్లామర్‌ పరంగా కొదవలేదు.

అయితే వాళ్లు చిరంజీవికి సిస్టర్‌ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. నవీన్‌ చంద్ర కూడా కనిపిస్తారట. ఇలా నోటెడ్‌ ఆర్టిస్ట్ లు బాగానే ఉన్నారట. వీరితోపాటు బాలీవుడ్‌ నటుడు కూనల్‌ కపూర్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నట్టు సమాచారం. ఇలా కాస్టింగ్‌కి బడ్జెట్‌ బాగానే అవుతుంది. 
 

అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ మూవీ బడ్జెట్‌ భారీగా పెరుగుతుందట. సీజీ వర్క్ ఎక్కువగా ఉండటంతో దానికి బాగా ఖర్చు అవుతుందని తెలుస్తుంది. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఆ నిర్మాతలకు బడ్జెట్‌ విషయంలో రాజీ పడరు. విక్కీ మెగా ఫ్యామిలీకి దగ్గర కావడంతో ఖర్చు విషయంలో వెనక్కి తగ్గేదెలే అనేలా ఉంటారు.

దీనికితోడు ఈ మూవీ(ఫాంటసీ ఎలిమెంట్ల)కి సీజీ వర్క్ ఎక్కువగా ఉండటంతో దానికి చాలా ఖర్చు అవుతుందని, బడ్జెట్‌ కంట్రోల్‌ దాటి పెరిగిపోతుందని తెలుస్తుంది. ఇదే ఇప్పుడు కలవరానికి గురి చేస్తుంది. ఓ వైపు ఓటీటీలు సగమే అడుగుతున్నారు. ఇంకోవైపు బడ్జెట్‌ పెరుగుతుంది. దీంతో నిర్మాతలు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చిందనే టాక్‌ వినిపిస్తుంది.

మరి చిరంజీవి లాంటి సినిమాకి ఇలాంటి పరిస్థితి అయితే మామూలు హీరోల పరిస్థితేంటనేది అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్‌ కంట్రోల్‌లో చేస్తేనే నిర్మాతలు సేఫ్‌గా ఉంటారు. లేదంటే సినిమాలు తీయాలంటేనే భయపడే పరిస్థితి వస్తుందని చెప్పొచ్చు. 
 

Latest Videos

click me!