ప్రస్తుతం తమిళంలోనే కాకుండా, మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న పవిత్ర, తమిళంలో... యుగి, జిగిరి దోస్త్, వన్స్ అప్పాన్ ఎ టైం ఇన్ మద్రాస్ చిత్రాలలో నటిస్తున్నారు.
కేరళలో జన్మించిన నటి సుజిత, తన ఒకవ ఏటనే బాలనటిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తమిళంలో భాగ్యరాజ్ నటించిన ముందానై ముడిచ్చు చిత్రంలో భాగ్యరాజ్ కుమార్తెగా నటించారు. ఆ తర్వాత బాలనటిగా తెలుగు, హిందీ, మలయాళం వంటి భాషల్లో దాదాపు 50కి పైగా చిత్రాలలో నటించారు. అలాగే సహాయ పాత్రల్లో కూడా పలు చిత్రాలలో నటించారు. చిన్నప్పటి నుంచే ఆమెను బాలనటిగా ప్రేక్షకులు చూసినందువల్లేమో, ఆమెకు కథానాయికగా అవకాశాలు రాలేదు.
సినిమాలే కాకుండా అనేక టెలివిజన్ షోలు, సీరియళ్లలో కూడా నటించారు. ముఖ్యంగా పాండ్యన్ స్టోర్ సీరియల్ ఆమెకు తమిళ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే విజయ్ టీవీలో కుక్ విత్ కోమలి షోలో పాల్గొని మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచారు. ఆమె చూడటానికి నటి మీరా జాస్మిన్‌లా ఉంటారు.