చిరంజీవి, వెంకటేష్‌, సుమన్‌, బోయపాటి.. సీనియర్‌ నటి ప్రభ కుమారుడి పెళ్లిలో తారల సందడి..

Published : Jan 03, 2024, 04:48 PM IST

అలనాటి నటి ప్రభ తన కుమారుడి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం హైదరాబాద్‌లో జరిగింది. పెళ్లి కార్యక్రమంలో చాలా మంది తారలు పాల్గొని సందడి చేశారు. 

PREV
16
చిరంజీవి, వెంకటేష్‌, సుమన్‌, బోయపాటి.. సీనియర్‌ నటి ప్రభ కుమారుడి పెళ్లిలో తారల సందడి..

నటి ప్రభ.. సీనియర్ హీరోల సరసన హీరోయిన్‌గా చాలా సినిమాల్లో పనిచేసింది. నటిగా, క్లాసిక్ డాన్సర్‌గా రాణించింది. తాజాగా ఆమె తనకు కుమారుడి పెళ్లి చేసింది. ప్రభ కుమారుడు రాజా రమేష్‌ వివాహం హైదరాబాద్‌లోని గండిపేటలో గల గోల్కొండ రిసార్ట్స్ లో జరిగింది. 
 

26

ఈ వివాహ వేడుకకి చాలా మంది సెలబ్రిటీలు కదిలి రావడం విశేషం. వీరిలో ప్రధానంగా సీరియర్‌ హీరోలు చిరంజీవి, వెంకటేష్‌, సుమన్‌, దర్శకుడు బోయపాటి, మురళీ మోహన్‌, సాయికుమార్‌, బెల్లంకొండ సురేష్‌ పాల్గొన్నారు. 
 

36

వీరితోపాటు నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణ, నిర్మాత దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, ఎస్వీకృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మల్లిడి సత్యనారాయణరెడ్డి, నిరసింహారావు, రేలంగి నరసింహారావు, రోజా రమణి, అన్నపూర్ణమ్మ, రజత, కృష్ణవేణి, శివ పార్వతితోపాటు ఇతర ఇతర ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. నూతన వధువరులను ఆశీర్వదించారు.
 

46

ప్రభ కుమారుడి వివాహ వేడుకలో ఏపీ టీడీపీ నాయకుడు అల్లపాటి రాజా కూడా పాల్గొన్నారు. తన సహచరులతో కలిసి ఆయన నూతన వధు వరులను ఆశీర్వదించారు. 
 

56

స్వర్గీయ దేవ భక్తుని రమేష్‌, ప్రభ దంపతుల కుమారుడు రాజా రమేష్‌ అమెరికాలో జాబ్‌ చేస్తున్నాడు. అక్కడే స్థిరపడ్డాడు. ఆయనకు విజయవాడకి చెందిన స్వర్గీయ విజయ్‌ రామ్‌ రాజు వేదగిరి, శిరీష దంపతుల కుమార్తె సాయి అపర్ణతో వివాహం జరిగింది. ప్రభకి ఒక్కడే కుమారుడు. 
 

66

నటి ప్రభ.. ఒకప్పుడు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు, మురళీ మోహన్‌, చంద్రమోహన్‌, మోహన్‌బాబు, కమల్‌ మాసన్‌, చిరంజీవి వంటి హీరోల సరసన హీరోయిన్‌గా చేసి మెప్పించింది. ఆమె తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ దాదాపు రెండు వందల చిత్రాల్లో నటించింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories