సడెన్‌గా ట్రెండింగ్‌లోకి `సైరా నరసింహారెడ్డి`..ఆ సీన్‌లో చిరంజీవి తర్వాతే ఎవరైనా, తెలుగు వారికి టేస్ట్ లేదా?

Published : Feb 21, 2025, 06:37 PM IST

చిరంజీవి నటించిన `సైరా నరసింహారెడ్డి` మూవీ గురించి ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తుంది. ఈ మూవీని `ఛావా`తో పోల్చుతూ దానికంటే గొప్పగా సినిమాగా వర్ణిస్తున్నారు.   

PREV
16
సడెన్‌గా ట్రెండింగ్‌లోకి `సైరా నరసింహారెడ్డి`..ఆ సీన్‌లో చిరంజీవి తర్వాతే ఎవరైనా, తెలుగు వారికి టేస్ట్ లేదా?
sye raa narasimha reddy movie

మెగాస్టార్ చిరంజీవి చేసిన మైథలాజికల్‌ మూవీస్‌ థియేటర్లలో ఆదరణ పొందలేదు. `శ్రీమంజునాథ`, ఆ మధ్య వచ్చిన `సైరా నరసింహారెడ్డి` కూడా డిజప్పాయింట్‌ చేశాయి. చిరంజీవి అంటే కమర్షియల్‌ ఎలిమెంట్ ఉండాల్సిందే. ఆటాపాటా, ఫైట్లు, కామెడీ, రొమాన్స్ పక్కా. అన్ని సమపాళ్లలో వండితేనే అది చిరంజీవి సినిమా అనేట్టుగా మారింది. అందుకే ఆయన కాస్ట్యూమ్‌ బేస్డ్ గా చేసిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. 
 

26
sye raa

చిరంజీవి `శ్రీమంజునాథ`వంటి డిజాస్టర్‌ తర్వాత ఈ విసయం తెలుసుకుని ఆయన ఇలాంటి సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ రీఎంట్రీ తర్వాత `సైరా నరసింహారెడ్డి` పేరుతో హిస్టారికల్‌ మూవీ చేశారు. గుర్తింపుకి నోచుకోని, చరిత్రలో తొక్కివేయబడ్డ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. 2019లో విడుదలై మిశ్రమ స్పందనని రాబట్టుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ హిట్‌ కాలేకపోయింది. చిరంజీవి ఇలా చూడలేకపోయారు. సినిమా చాలా వరకు నష్టాలను మిగిల్చింది. 
 

36
sye raa

కానీ ఇప్పుడు అనూహ్యంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో ఈ మూవీకి సంబంధించిన చర్చ ప్రారంభమైంది. క్లైమాక్స్ సీన్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. మోస్ట్ అండర్‌ రేటేడ్‌ మూవీగా దీన్ని అభివర్ణిస్తున్నారు. సినిమా చాలా గొప్పగా ఉంటుందని, కానీ ఆ స్థాయి ఆదరణ లభించలేదని, తెలుగు ఆడియెన్స్ ఆదరించలేదని చెప్పారు. మన వారికి టేస్ట్ లేదని, ఒక గొప్ప సినిమా కిల్‌ అయ్యిందంటున్నారు. 

46
chhava

మరి ఇప్పుడు ఎందుకు ఈ మూవీ గురించి చర్చ నడుస్తుంది? అనేది చూస్తే కారణం బాలీవుడ్‌లో వచ్చి `ఛావా` మూవీ. విక్కీ కౌశల్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ గత వారం విడుదలై భారీ విజయాన్ని సాధించింది. భారీ కలెక్షన్ల దిశగా వెళ్తుంది. ఇప్పటికే ఇది రెండు వందల కోట్లు దాటింది. బాలీవుడ్‌లో, నార్త్ లో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.

ఈ మూవీ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్‌ జీవితం ఆధారంగా చేసుకుని రూపొందించిన సినిమా కావడం. ఆయన వీరత్వాన్ని, ఔరంగాజేబు ఎంతటి హింసలు పెట్టినా తాను నమ్మిన ధర్మం కోసం నిలబడటం, తన సైన్యంలో ఉద్యమస్ఫూర్తిని, పోరాట స్ఫూర్తిని రగిల్చడం వంటి సన్నివేశాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ కొందరు ఆడియెన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. విక్కీ కౌశల్‌ నటనకు అభినందనలు తెలియజేస్తున్నారు. అద్భుతమైన సినిమా వచ్చిందంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

56
sye raa

కానీ ఈ మూవీకి మించి `సైరా`లో చిరంజీవి చేశారు. క్లైమాక్స్ లో చిరంజీవిపై ఉండే సీన్‌ ఎవర్‌ గ్రీన్‌ అని, ఎప్పటికీ నిలిచిపోతుందని అంటున్నారు. `సైరా` తర్వాతనే మరేదైనా అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో `సైరా` సీన్లని, క్లిప్స్‌ ని పంచుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఫస్ట్ డే కలెక్షన్ల పరంగానూ ఈ మూవీ సరికొత్త రికార్డు సృష్టించింది. `నాన్‌ బాహుబలి` రికార్డుని తిరగరాసిందని, ఫస్ట్ డే 81కోట్ల గ్రాస్‌ సాధించింది. ఆ తర్వాత డౌన్‌ అయ్యింది. టోటల్‌గా  ఈ మూవీ 240 కోట్ల గ్రాస్‌, 140కోట్ల షేర్‌ సాధించింది. కానీ బడ్జెట్‌ దాన్ని మించి ఉంది. ఫెయిల్యూర్‌ కిందకు వెళ్లింది. 

66
sye raa

`సైరా నరసింహారెడ్డి` సినిమాలో సైరాగా చిరంజీవి నటించగా, అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా ముఖ్య పాత్రలు పోషించారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. పరుచూరి బ్రదర్స్ కథ అందించారు. సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్‌లు రాశారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మించారు. 

read more: హీరోయిన్‌ కాలు తొక్కిందని బాలకృష్ణ పెద్ద గొడవ.. సారీ చెప్పినా వినలేదు, ప్యాకప్‌ చెప్పడంతో నటి కన్నీళ్లు

also read: రామ్ చరణ్ ను చిరంజీవి ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారో తెలుసా? మెగా ఫ్యాన్స్ కు పండగే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories