శ్రీజతో విడిపోయాక కళ్యాణ్ దేవ్ కెరీర్ ని మెగా ఫ్యామిలీ పట్టించుకోలేదు. సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాలకు ఎలాంటి ప్రమోషన్స్ కల్పించలేదు. దాంతో ఆ రెండు చిత్రాలు నిరాదరణకు గురయ్యాయి. తాము విడిపోయినట్లు శ్రీజ, కళ్యాణ్ దేవ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా ఒక స్పష్టత అయితే ఇచ్చారు.