జగదేక వీరుడు అతిలోక సుందరి విడుదలైన నాలుగేళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన మరో చిత్రం ఎస్పీ పరశురాం. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ఫ్యాన్స్ ఆశలపై ఈ చిత్రం నీళ్లు చల్లింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కిన ఎస్పీ పరశురాం దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది.