2009లో విడుదలైన మగధీర ఇండస్ట్రీ రికార్డ్స్ తుడిచి పెట్టింది. వంద కోట్ల వసూళ్లు రాబట్టిన మొదటి టాలీవుడ్ మూవీ మగధీర. అప్పటికి రాజమౌళి కెరీర్లో మగధీర బిగ్గెస్ట్ హిట్. చిరుత మూవీతో హీరోగా పరిచయమైన రామ్ చరణ్ నటించిన రెండవ చిత్రం మగధీర. పునర్జన్మల నేపథ్యంలో సోషియో ఫాంటసీ జానర్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.
కాల భైరవ పాత్రలో రామ్ చరణ్ అద్భుతం చేశాడు. గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధాలు మెస్మరైజ్ చేస్తాయి. హీరోయిన్ కాజల్ అగర్వాల్ గ్లామర్, నటన ఆకట్టుకున్నాయి. రామ్ చరణ్-కాజల్ కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. లవ్ ట్రాక్ ఆహ్లాదంగా ఉంటుంది. బలమైన ఎమోషన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. మగధీర మూవీలో శ్రీహరి కీలక రోల్ చేశారు. ఈ సినిమా కథ విని చిరంజీవి భయపడ్డారట. రాజమౌళి స్వయంగా ఈ విషయం వెల్లడించారు.
Rajamouli
గతంలో రాజమౌళి జయప్రదం అనే టాక్ షోలో పాల్గొన్నారు. సీనియర్ నటి జయప్రద హోస్ట్ గా వ్యవహరించారు. ఈ షోలో మగధీర చేయడానికి ముందు రామ్ చరణ్ కి ఏమైన ప్రత్యేక శిక్షణ ఇప్పించారా? అని అడిగారు. గతంలో పోల్చితే ఆ మూవీలో రామ్ చరణ్ పర్ఫెక్షన్ సాధించాడన్న భావన కలుగుతుంది. దీనికి ఏదైనా కసరత్తు జరిగిందా? అని జయప్రద రాజమౌళిని అడిగారు.
లేదని రాజమౌళి సమాధానం చెప్పారు. చిరుత సినిమా చూసినప్పుడే పెద్ద సినిమాలను, క్యారెక్టర్స్ ని రామ్ చరణ్ డీల్ చేయగలడు అనిపించింది. అందుకే మగధీర సినిమాకు రామ్ చరణ్ సెట్ అవుతాడని నేను భావించాను. మగధీర మూవీ కథను చిరంజీవికి రఫ్ గా ఒక లైన్ చెప్పాము.
Magadheera
రాజమౌళి నమ్మకాన్ని నిలబెడుతూ మగధీర మూవీలో రామ్ చరణ్ విజృంభించాడు. ఆయన తప్ప మరొకరు ఆ సినిమా చేయలేరు అన్న రేంజ్ లో నట విశ్వరూపం చూపించాడు. కాగా హీరోయిన్ గా కాజల్ ని కూడా మొదట వద్దనుకున్నారట చిరంజీవి. అప్పటికి కాజల్ కి ఫేమ్ లేదు. అలాగే ప్లాప్స్ లో ఉంది. మరొక హీరోయిన్ ని ఎంపిక చేయాలని రాజమౌళికి చిరంజీవి సలహా ఇచ్చారట.
అయితే మిత్రవింద పాత్రకు కాజల్ కరెక్ట్ ఛాయిస్ అని నమ్మిన రాజమౌళి... చిరంజీవిని కన్విన్స్ చేశాడట. కాజల్ పై లుక్ టెస్ట్ నిర్వహించి.. ఆ ఫోటోలు చిరంజీవికి చూపించారట. అప్పుడు చిరంజీవి తన అభిప్రాయం మార్చుకున్నారట. అల్లు అరవింద్ మగధీర చిత్రాన్ని నిర్మించారు. ఆయనకు కోట్ల కొద్దీ లాభాలు తెచ్చిపెట్టింది మగధీర. దాదాపు 13 ఏళ్ల అనంతరం రాజమౌళి-రామ్ చరణ్ కాంబోలో ఆర్ ఆర్ ఆర్ విడుదలైంది.