రాజమౌళి, మహేష్ బాబు చిత్రం..ఫైనాన్స్ చేసేది ఆ పెద్ద సంస్దేనా?

First Published | Jan 3, 2025, 10:56 AM IST

దర్శకధీరుడు రాజమౌళి, హీరో మహేశ్‌బాబుల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న SSMB 29 చిత్రం అఫీషియల్‌గా లాంచ్ అయ్యింది. ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది.


 దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), హీరో మహేశ్‌బాబు (Mahesh Babu)ల కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా చెప్పబడుతున్న ఈ చిత్రం అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగినందని తెలుస్తోంది.

నగర శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ వేడుక నిర్వహించారు. చిత్ర టీమ్ తోపాటు మహేశ్‌బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా లాంఛ్‌కు సంబంధించి టీమ్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన, ఫొటోలు వెలువడలేదు. మరోవైపు, ఈ సినిమా ప్రారంభంపై మహేశ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ఇది ఇలా ఉంటే ఈ చిత్రం బిజినెస్ డీల్స్,ఫైనాన్స్ డీల్స్ ఇప్పటికే మొదలయ్యాయి. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. . అలాగే ఈ సినిమాకు భారీ బడ్జెట్ అవుతూండటంతో హాలీవుడ్ స్టూడియోతో పాటు, లోకల్ గా టీ సీరిస్ తోనూ చర్చలు జరుగుతున్నాయని వినికిడి. టీ సీరిస్ వారు తెలుగు, హిందీ సినిమాలకు పెద్ద ఎమౌంట్స్ ఫండింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు మహేష్, రాజమౌళి చిత్రానికి ఫండింగ్ చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు వినికిడి. 



టీ సీరిస్ తో కొలాబరేట్ అవటానికి ఇప్పటికే చర్చలు జరిగాయి. అవి ఫైనల్ స్టేజిలో ఉన్నాయని త్వరలోనే ఫార్మల్ ఎగ్రిమెంట్స్ పూర్తి చేసుకుని అఫీషియల్  ఎనౌన్సమెంట్ త్వరలో రావచ్చని తెలుస్తోంది. ఈ సినిమాకు కావాల్సిన మేజర్ ఎమౌంట్ ని టీ సీరిస్ ఫైనాన్స్ చేస్తుందని, అందులో భాగంగా నాన్ థియేటర్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ తీసుకోబోతుందని ట్రేడ్ అంటోంది. 


అలాగే ఈ వేసవి నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ మొదలు కానుందని సమాచారం. ఒకే మూవీగా తీసుకొస్తారా? లేక రెండు భాగాలుగా విడుదల చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించనున్నారని టాక్‌. హాలీవుడ్‌ నటీనటులు, టెక్నీషియన్స్‌ కూడా ఇందులో భాగం అయ్యారని వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పష్టత రావాల్సి ఉంది. 
 

తన సినిమాలకు అంతకంతకూ బడ్జెట్ పెంచుకుంటూ పోతున్న రాజమౌళి.. ట్రిపుల్ ఆర్ కోసం 450 నుంచి 500 కోట్ల వరకూ ఖర్చు చేశాడు. ఇక ఈసినిమాకు అంతకు మించి అన్నట్టగా.. 500 నుంచి 600 కోట్ల వరకూ బడ్జెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ కే ఎక్కువగా  ఖర్చు పెట్టనున్నట్టు తెలుస్తోంది. 


అంతేకాకుండా భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి (SS Rajamouli) ఈ చిత్రంతో ఆవిష్కరించనున్నారని రచయిత విజయేంద్రప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. సరికొత్త లుక్‌లో మహేశ్‌ (Mahesh Babu) కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం గత కొంతకాలంగా ఆయన సన్నద్ధమవుతోన్న విషయం తెలిసిందే. మరోవైపు రాజమౌళి లొకేషన్స్‌ కూడా సెర్చ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఒడిశా వెళ్లి వచ్చారు. కొంతకాలం క్రితం ఆఫ్రికాలోని అడవుల్లోనూ పర్యటించారాయన. 
 

Latest Videos

click me!