చిరంజీవికి చెల్లెలు.. బాలయ్య హీరోయిన్.. సినిమాలకు దూరంగా ఉంటున్న నటి ఎవరో తెలుసా..?

First Published | Dec 1, 2024, 11:32 AM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాలో.. హిరోయిన్ గా నటించని ఓ స్టార్ హీరోయిన్ చిరంజీవి చెల్లెలు అని మీకు తెలుసా..? ఇంతకీ ఎవరా నటి..? మెగాస్టార్ తో చెల్లెలు వరుస ఎలా కుదిరింది...? 

Chiranjeevi - Balakrishna

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏవైనా సాధ్యమే.. కొన్ని కొన్నికాంబినేషన్లు అస్సలు అర్ధం కావు.. అర్దం అయినట్టే ఉంటాయి కాని కన్ ఫ్యూజ్ చేస్తుంటాయి. ప్రస్తుతం ఇక్కడ టాపిక్ లో మెయిన్ పాత్ర కూడా అంతే. ఈ హీరోయిన్ బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ మూవీ చేసింది. కాని మెగాస్టార్ చిరంజీవికి మాత్రం చెల్లెలు వరస అవుతుంది. అదేంటి బాలయ్యతో హీరోయిన్ గా చేసిన నటి.. చిరంజీవికి చెల్లెలు అనేస్తున్నారు.  అని డౌట్ రావచ్చు. అయితే ఆ హీరోయిన్ మెగాస్టార్ కు చెల్లెలు ఎలా అయ్యింది..? ఇంతకీ ఎవరా నటి అనే వివరాలు చూస్తే..? 

Also Read: సుబ్బరాజు భార్య బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా... ఏం చేస్తుంది.. ఎక్కడ ఉంటుంది..?
 

ఇక ఇప్పుడు మెగాస్టార్ చెల్లెలు అని ఎందుకు అన్నామో ఆ విషయానికి వస్తే..  మోహిని నటించిన సినిమాల్లో మరో బ్లాక్ బస్టర్ మూవీలో చిరంజీవికి చెల్లెలుగా నటించింది మోహిని. ఒక బ్లాక్ బస్టర్ మూవీలో బాలయ్య ప్రియురాలిగా నటిస్తే.. మరో బ్లాక్ బస్టర్ మూవీలో చిరంజీవికి పెద్ద చెల్లెలుగా నటించింది. ఆసినిమా ఏదో కాదు హిట్లర్. 

హిట్లర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఈసినిమాలో చిరంజీవికి ఐదుగురు చెల్లెల్లు ఉంటే అందులో పెద్దచెల్లిగా మోహిని కనిపించింది. రాజేంద్ర ప్రసాద్ ను ప్రేమించి.. చిరంజీని ఎదురించి పెళ్ళి చేసుకున్న పాత్రలో కనిపించింది మోహిని. 

Also Read: టేస్టీ తేజకు షాకింగ్ రెమ్యునరేషన్, 8 వారాలకి అంత వసూలు చేశాడా..?
 

Latest Videos


మీకు హీరోయిన్ మోహిని గుర్తుందా..? మోహిని అంటే ఎవరికి గుర్తుకు రాదేమో కాని.. బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా హీరోయిన్ అంటే మాత్రం వెంటనే గుర్తుకు వస్తుంది. అవును ఈ బ్లాక్ బస్టర్ మూవీలో హీరోయిన్ గా నటించిన బ్యూటీ అందరికి గుర్తు ఉండి ఉంటుంది. కాని ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ కాదు.. వేరే సినిమాలు కూడా చేయలేదు కదా అని టక్కున అనుకుంటుంటారు ఆడియన్స్. కాని మోహిని తెలుగులో మరికొన్ని సినిమాలు చేసింది. 

Also Read: హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ఏకైకా తెలుగు సీరియల్ ఏదో తెలుసా..?

అలా చిరంజీవికి చెల్లెలుగా.. బాలయ్య సరసన హీరోయిన్ గా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది మోహిని. ఆదిత్య 369 సినిమాలో ఆమె నటకు మంది మార్కులు పడ్డాయి. ఇ హిట్లర్ సినిమాతో పాటు  ఈ రెండు సినిమాలతో పాటు తెలుగులో మరో సినిమాలో కూడా నటించింది నటి. మోహన్ బాబు తో డిటెక్టివ్ నారదా అనే చిత్రం లో నటించింది.

Also Read: 33 ఏళ్ళ తరువాత ఆ స్టార్ డైరెక్టర్ తో రజినీకాంత్ సినిమా, తలైవా ఫ్యాన్స్ కు పండగే.
 

తమిళ పరిశ్రమకు చెందిన మోహిణి బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా మాత్రం తెలుగులోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆతరువాత వరుసగా ఆమెకు తమిళంలో అవకాశాలు వచ్చాయి. అక్కడ వరుసగా 7 సినిమాలు చేసి స్టార్డమ్ కూడా అందుకుంది. కెరీర్ పరంగా లైఫ్ ఇచ్చిన తెలుగులో మూడే సినిమాలు చేసిన ఈ హీరోయిన్.. తమిళ, మళయాల కన్నడ పరిశ్రమలో మాత్రం ఎక్కువ సినిమాలు చేసింది. 

 అలా ఇండస్ట్రీ లోకి వచ్చిన రెండేళ్ల లోపే స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకున్న ఈమె 1999 వ సంవత్సరంలో శ్రీనివాసన్ అనే అతన్ని ప్రేమించి పెళ్లాడింది.. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈమె, మళ్ళీ 2004 వ సంవత్సరంలో రీ ఎంట్రీ ఇచ్చి 2011 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేసింది. ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్ లో నటించిన ఈమె, ప్రస్తుతం కెమెరా కి దూరంగా తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతుంది.

click me!