రెహ్మాన్ గురించి చెబుతూ, అద్భుతమైన పాటలు అందించారని, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించారని రెహ్మాన్‌ని అభినందించారు. తన కెమెరాతో ప్రతి ఫ్రేమ్‌ని అద్భుతంగా మలిచాడని రత్నవేలుకి, అలాగే అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించారని అవినాష్ కొల్లాని, ఎడిటర్ నవీన్ నూలి తన నైపుణ్యంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడని అభినందించారు. ఈ సినిమా విజయంలో భాగమైన జాన్వీ కపూర్, దివ్యేందు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలకు ఆయన అభినందనలు తెలిపారు. పెద్ది సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమాకి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు చిరంజీవి. పెద్ది సినిమాపై ఆయన ఇచ్చిన రివ్యూ వైరల్‌గా మారింది.