చిరంజీవి, బాబీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీ నుంచి ఓ క్రేజీ హీరోయిన్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఘనవిజయం సాధించిన తర్వాత మరో కొత్త చిత్రం ప్రారంభించారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో అనశ్వర రాజన్ చిరంజీవి కూతురు పాత్రలో నటిస్తోంది.
25
వీరసింహారెడ్డి హీరోయిన్ హనీ రోజ్
అయితే ఓ హీరోయిన్ విషయంలో ఊహించని ప్రచారం మొదలైంది. బాలకృష్ణ వీర సింహారెడ్డి చిత్రంలో హనీ రోజ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఆ తర్వాత ఈ కన్నడ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. సోషల్ మీడియాలో హనీ రోజ్ గ్లామరస్ లుక్స్ కి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది.
35
చిరు, బాబీ మూవీలో హనీ రోజ్
చిరు, బాబీ చిత్రంలో కీలక పాత్రలో ఆమెకి అవకాశం దక్కిందట. సెకండ్ హీరోయిన్ రోల్ అనే ప్రచారం కూడా జరిగింది. ఈ చిత్రానికి హనీ రోజ్ సైన్ చేశారట. కానీ షూటింగ్ కి మాత్రం హాజరు కాలేదని అంటున్నారు. దీనితో చిరు బాబీ చిత్రం నుంచి హనీ రోజ్ తప్పుకుందనే ప్రచారం జోరందుకుంది.
చిరంజీవి లాంటి అగ్ర హీరో సినిమా నుంచి ఆమె తప్పుకోవడానికి కారణాలు మాత్రం తెలియలేదు. చిరు బాబీ చిత్ర షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ ఆమె షూటింగ్ లో పాల్గొనలేదు. కనీసం హైదరాబాద్ కి కూడా రాలేదు అని అంటున్నారు. దీనితో ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకున్నది వాస్తవమే అంటూ ప్రచారం జరుగుతోంది.
55
వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి
అయితే దీనిపై చిత్ర యూనిట్ కానీ, హనీ రోజ్ కానీ ఇంకా అధికారికంగా స్పందించాలేదు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ, చిరు కాంబోలో వస్తున్న చిత్రం ఇది. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీలో చిరు గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు.