కెరీర్లో ఎదుగుతున్న చిరంజీవిని చంపేందుకు ప్రత్యర్ధులు కుట్ర పన్నారని మరో వెర్షన్ కూడా ఉంది. కేక్ తిన్న చిరంజీవి అస్వస్థతకు గురయ్యారని, ఆయన్ని హుటాహుటిన చెన్నైలోని ఆసుపత్రికి తరలించారని, రెండు రోజుల చికిత్స అనంతరం కోలుకుని బయటకు వచ్చారని కొందరి వాదన. అప్పట్లో సమాచార విప్లవం ఈ స్థాయిలో లేదు. చిరంజీవి మీద జరిగిన దాడిని ఒకటి రెండు మీడియా సంస్థలు మాత్రమే కవర్ చేశాయి.