Chiranjeevi Grandfather: చిరంజీవి తాత ఎంత రసికుడో తెలుసా,ఏకంగా ముగ్గురితో.. ఆయన పోలికలు రానందుకు హ్యాపీ

Published : Feb 12, 2025, 10:07 AM IST

Chiranjeevi Grandfather: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఎక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు. చిన్న చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి హాజరై తనవంతు సహకారం అందిస్తున్నారు. అయితే చిరంజీవి చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

PREV
15
Chiranjeevi Grandfather: చిరంజీవి తాత ఎంత రసికుడో తెలుసా,ఏకంగా ముగ్గురితో.. ఆయన పోలికలు రానందుకు హ్యాపీ
megastar chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఎక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు. చిన్న చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి హాజరై తనవంతు సహకారం అందిస్తున్నారు. అయితే చిరంజీవి చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లైలా చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చేసిన పొలిటికల్ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. 

25

రీసెంట్ గా చిరంజీవి.. బ్రహ్మానందం నటించిన బ్రహ్మ ఆనందం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ చిరంజీవి తాతగారి ఫోటో ని స్క్రీన్ పై ప్రదర్శించారు. ఆయన చిరంజీవి తల్లి అంజనాదేవి గారి తండ్రి. ఆయన పేరు రాధాకృష్ణ నాయుడు అని చిరంజీవి తెలిపారు. నెల్లూరుకు చెందిన రాధాకృష్ణ నాయుడు మొగల్తూరులో సెటిల్ అయ్యారు. స్టేట్ ఎక్సయిజ్ శాఖ ఇన్స్పెక్టర్ గా రిటైర్ అయ్యారు. 

 

35

నీకు ఎవరి పోలికలు వచ్చినా పర్వాలేదు కానీ ఆయన పోలికలు బుద్దులు మాత్రం రాకూడదు అనేవారు.. ఎందుకంటే ఆయన మహా రసికుడు అని చిరంజీవి కామెంట్స్ చేశారు. దీనితో అక్కడున్న వారంతా నవ్వేశారు. నాకు ఇద్దరు అమ్మమ్మలు ఉండేవారు. అంటే ఆయనకి ఇద్దరు భార్యలు. వాళ్ళిద్దరి మీద కోపం వస్తే మూడో ఆవిడ దగ్గరకి వెళ్లేవారు. నాలుగు, ఐదు కూడా ఉన్నాయో నాకు తెలియదు అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. 

 

45

నేను సినిమాల్లోకి వెళుతుంటే.. అక్కడ నీకు చాలా అవకాశాలు ఉంటాయి. మీ తాతలా మాత్రం కావద్దు అని ఇంట్లో వాళ్ళు హెచ్చరించారు. ఆయన పోలికలు నాకు రాలేదు అందుకు సంతోషం. ఆయన్ని ఆదర్శంగా కూడా తీసుకోలేదు అని చిరంజీవి తెలిపారు. 

 

55

ఆయన రసికుడైనప్పటికీ దానధర్మాలు ఎక్కువగా చేసేవాడు. ఆ గుణం మాత్రం తనకి వచ్చింది అని చిరంజీవి తెలిపారు. చిరంజీవి తన ఫ్యామిలీ సీక్రెట్ ని రివీల్ చేయడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 

 

click me!

Recommended Stories