చిరంజీవి ఫస్ట్ లవ్‌ మామూలు క్రేజీ కాదు.. సైకిల్‌ నేర్పిస్తున్న అమ్మాయితో మెగాస్టార్ చేసిన పనేంటో తెలుసా?

Published : Jul 24, 2024, 06:35 PM ISTUpdated : Jul 24, 2024, 08:19 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి తన ఫస్ట్ లవ్‌ స్టోరీని బయటపెట్టాడు. టీనేజ్‌ టైమ్‌లో ఆ అమ్మాయితో చేసిన పని బయటపెట్టాడు చిరు. మొత్తం రచ్చ లేపాడు.   

PREV
16
చిరంజీవి ఫస్ట్ లవ్‌ మామూలు క్రేజీ కాదు.. సైకిల్‌ నేర్పిస్తున్న అమ్మాయితో మెగాస్టార్ చేసిన పనేంటో తెలుసా?

  చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగాస్టార్ గా రాణిస్తున్నారు. ఆయన మెగా ఇమేజ్‌ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇప్పుడు యంగ్‌ హీరోలు పాన్‌ ఇండియా, పాన్‌ వరల్డ్ మూవీస్‌తో దుమ్మురేపుతున్నా, చిరంజీవి స్థానం ఎప్పటికీ పదిలం. దాన్ని ఎవరూ టచ్‌ చేయలేరనేది వాస్తవం. ఈ ఏజ్‌లోనూ స్టార్‌ హీరోలకు పోటీ ఇస్తున్నాడు చిరు. తన సత్తా చాటుతున్నాడు.  

26

చిరంజీవి తెలుగు సినిమాని కమర్షియల్‌ వైపు నడిపించారు. కొత్త పుంతలు తొక్కించాడు. టాలీవుడ్‌ కమర్షియల్‌ బాట పట్టిందంటే దానికి చిరంజీవి మెయిన్‌ కారకుడు, ఆయన దర్శకులు ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఆయా సినిమాలోనే ఆయన మెగాస్టార్‌ గా ఎదిగాడు. అయితే ఆయన సినిమాల్లో యాక్షన్, లవ్‌, రొమాన్స్, పాటలు, కామెడీ ఇలా అన్నీ సమపాళ్లలో ఉంటాయి. లవ్‌ సీన్లలోనూ ఇరగదీస్తాడు చిరు. 
 

36

రియల్‌ లైఫ్‌లో మ్యారేజ్‌ విషయంలో ఆ లవ్‌ స్టోరీలేదు. ఆయనది సురేఖతో అరెంజ్‌ మ్యారేజ్‌. కానీ పెళ్లి చూపుల్లో ఎలాంటి డ్రామా నడిచిందో ఆ మధ్య చిరు తెలియజేశారు. ఆద్యంతం కామెడీగా చెప్పి నవ్వులు పూయించారు. అయితే చిరంజీవి హీరోగా ఎదుగుతున్న సమయంలోనే ఆయనలోనే స్పార్క్, కసి, టాలెంట్‌ ని గుర్తించిన అల్లూ రామలింగయ్య.. చిరంజీవిని వదల్లేదు. గట్టిగా పట్టుకున్నాడు. ఎట్టకేలకు తన కూతురు సురేఖని ఇచ్చి పెళ్లి చేశాడు. హీరోగా బిజీగా ఉన్న సమయంలోనే మ్యారేజ్‌ జరిగింది. పెళ్లైన కొత్తలో ఫ్రీగా ఉండేందుకు కూడా కుదరలేదు. మొత్తంగా వీరికి ముగ్గురు పిల్లలు సుస్మిత, రామ్‌ చరణ్‌, శ్రీజ జన్మించారు. 
 

46

అయితే రియల్‌ లైఫ్‌లో తనకు కూడా ఓ లవ్‌ స్టోరీ ఉందని చెప్పాడు చిరంజీవి. అది టీనేజ్‌ లవ్‌ స్టోరీ అని తెలిపారు. ఏడో క్లాస్‌లోనే ఈ లవ్‌ ట్రాక్‌ నడిపినట్టు చెప్పారు. ఆ అమ్మాయి పేరు చెప్పని చిరు, ఆ టైమ్‌లో ఆ అమ్మాయి సైకిల్‌ తొక్కుతుందట. అప్పట్లో తనకు సైకిల్‌ ఉండేది కాదట. ఆమె రోజూ తన ఇంటి ముందు నుంచి వెళ్తుండేది. అప్పుడు తనకు సైకిల్‌ తొక్కడం రాదు, లైట్‌గా వచ్చుగానీ, పెద్దగా వచ్చేది కాదు. 
 

56

కానీ అమ్మాయి సైకిల్‌ తొక్కడం అంటే మొగల్తూరులో చాలా గొప్ప విషయం. అది చాలా ఆశ్చర్యంగానూ అనిపించేది. మా ఇంటినుంచే ఆ అమ్మాయి సైకిల్‌ పై వెళ్తుండేది. ఈ క్రమంలో క్లాస్‌మేట్‌ కాబట్టి పరిచయం చేసుకున్నా ఫ్రీ అయ్యాడట. ఆ సమయంలో తనకు సైకిల్‌ నేర్పిస్తావా అంటే ఆ అమ్మాయి సైకిల్ నేర్పించిందట. తాను సైకిల్‌ తొక్కుతుంటే ఆమె పట్టుకునేదట. సైకిల్‌ తొక్కుతుంటే ఊరికే ఆమె వంక సైడ్‌ చూస్తుండేవాడట. ఆమె ప్రతిసారి అటు చూడు అంటూ తలతిప్పేదని వెల్లడించారు. ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అని తెలిపారు చిరు. 

66

అమీర్‌ ఖాన్‌ నటించిన `లాల్‌ సింగ్‌ చద్దా` సినిమా తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా అమీర్‌ ఖాన్‌, నాగార్జున, నాగచైతన్యతో కలిసి చేసిన చాటింగ్‌లో ఈ విషయాన్ని బయటపెట్టాడు చిరంజీవి. ప్రస్తుతం ఆయన `విశ్వంభర` సినిమాలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్‌ కాబోతుంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories