యావరేజ్ మూవీ ఇవ్వు చాలు, బ్లాక్ బస్టర్ అయిపోద్ది అని త్రివిక్రమ్ ని బ్రతిమాలిన చిరు.. తన కోసం కాదు

Published : Mar 21, 2025, 09:28 AM IST

Chiranjeevi and Trivikram : ఒక సందర్భంలో చిరంజీవి మంచి హిట్ మూవీ కోసం త్రివిక్రమ్ ని రిక్వస్ట్ చేశారట. అయితే అది తన సినిమా కోసం కాదు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

PREV
15
యావరేజ్ మూవీ ఇవ్వు చాలు, బ్లాక్ బస్టర్ అయిపోద్ది అని త్రివిక్రమ్ ని బ్రతిమాలిన చిరు.. తన కోసం కాదు
Chiranjeevi, Trivikram

Chiranjeevi and Trivikram: మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక్క చిత్రం కూడా రాలేదు. గతంలో రూమర్స్ వచ్చాయి కానీ ప్రాజెక్ట్ మాత్రం పట్టాలెక్కలేదు. కానీ ఒక సందర్భంలో చిరంజీవి మంచి హిట్ మూవీ కోసం త్రివిక్రమ్ ని రిక్వస్ట్ చేశారట. అయితే అది తన సినిమా కోసం కాదు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

25

మెగాస్టార్ చిరంజీవి తన ఎదుగుతూ కుటుంబాన్ని కూడా పైకి తీసుకువచ్చారు. చిరంజీవి ప్రమేయంతోనే పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయం అయ్యారు. ఖుషి చిత్రం వరకు పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో తిరుగులేకుండా పోయింది. ఖుషి చిత్రంతో పవన్ కళ్యాణ్ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. పెరిగిన అంచనాల కారణంగా ఖుషి తర్వాత పవన్ చేసిన ఏ చిత్రమూ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. 

35
allu arjun, trivikram srinivas, pan india movie

పదేళ్ల పాటు ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ కి సరైన హిట్ లేదు. మధ్యలో జల్సా చిత్రం చిన్న ఊరటగా నిలిచింది. జల్సా చిత్రం చేస్తున్నప్పుడు చిరు.. పవన్ కోసం త్రివిక్రమ్ ని రిక్వస్ట్ చేశారట. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా జల్సా ఆడియో లాంచ్ లో తెలిపారు. త్రివిక్రమ్ జల్సా చిత్రం చేస్తున్నప్పుడు.. యావరేజ్ మూవీ ఇవ్వు చాలు ఖుషి రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయిపోద్ది అని చెప్పారట. ఎందుకంటే అభిమానులు పవన్ చిత్రం కోసం అంతలా ఎదురుచూస్తున్నారు అని చిరు అన్నారు. 

45

దీనితో త్రివిక్రమ్ యావరేజ్ కాదు సార్, ఖుషి లాంటి చిత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తా అని చెప్పారట. అలా అయితే ఖుషికి పది రెట్లు సూపర్ హిట్ అవుతుంది అని చిరంజీవి చెప్పారు. జల్సా సాంగ్స్ ఇప్పటికీ పవన్ కెరీర్ లోనే బెస్ట్ ఆల్బమ్ అని చెప్పొచ్చు. జల్సా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు కానీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ వసూళ్లు మాత్రం అదిరిపోయాయి. 

55

ఈ చిత్ర ఆడియో లాంచ్ కి చిరంజీవితో పాటు అల్లు అర్జున్, రాంచరణ్ హాజరయ్యారు. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసిన వ్యక్తి ఎవరో కాదు.. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్. ఈవెంట్ ని చాలా బాగా చేశావు అని చిరంజీవి శిరీష్ ని అభినందించారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories