Chiru-Charan: టాలీవుడ్‌లో అరుదైన రికార్డులు సెట్‌ చేసిన చిరంజీవి, రామ్‌ చరణ్‌.. పవన్‌, అల్లు అర్జున్‌ కూడా తర్వాతే

Published : Feb 26, 2026, 07:33 AM IST

టాలీవుడ్‌లో తండ్రీ కొడుకులు చిరంజీవి, రామ్‌ చరణ్‌ అరుదైన రికార్డులు సెట్‌ చేశారు. కలెక్షన్ల పరంగా ఒక బెంచ్‌ మార్క్ లు సెట్‌ చేశారు. ఇది అల్లు అర్జున్‌, పవన్‌ కళ్యాణ్‌కి కూడా సాధ్యం కాలేదు. 

PREV
17
చిరంజీవి, రామ్‌ చరణ్‌ అరుదైన కలెక్షన్ల రికార్డ్ లు.. బన్నీకి, పవన్‌కి సాధ్యం కాలేదు

టాలీవుడ్‌లో ఇప్పుడు సినిమా కలెక్షన్లు అనేది చాలా చర్చనీయాంశంగా మారుతుంది. ఒక సినిమా హిట్‌కి కలెక్షన్లే కొలమానంగా మారిపోయింది. ఐదు వందల కోట్లు, వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లు అని మాట్లాడుకుంటున్నారు. `బాహుబలి`తో ఈ కలెక్షన్ల పోటీ బాగా పెరిగిపోయింది. అయితే ఇవన్నీ మొదలు కాకముందే వసూళ్ల వర్షం కురిపించి ట్రెండ్‌ సెట్‌ చేశారు చిరంజీవి. ఆయన కొన్ని కలెక్షన్ల క్లబ్‌లు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తనయుడు రామ్‌ చరణ్‌ దాన్ని కంటిన్యూ చేయడం విశేషం. తండ్రీ కొడుకుల జోరు ముందు మెగా హీరోలు అల్లు అర్జున్‌, పవన్‌ కళ్యాణ్‌ వెనకబడ్డారనే చెప్పొచ్చు. 

27
`ఘరానా మొగుడు` తొలి రూ.10 కోట్ల మూవీ

టాలీవుడ్‌లో మొదటి రూ.పది కోట్ల మూవీ `ఘరానా మొగుడు`గా చెబుతుంటారు. చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రమిది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. నగ్మా, వాణి విశ్వనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. 1992లో రూపొందిన మాస్‌ కమర్షియల్‌ మూవీ ఇది. పెద్ద హిట్‌ అయ్యింది. బాక్సాఫీసుని షేక్‌ చేసింది. అప్పట్లో బాక్సాఫీసు వద్ద మొదటిసారి పది కోట్ల గ్రాస్‌ని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ అరుదైన రికార్డుని చిరంజీవి సెట్‌ చేశారు. ఆ తర్వాత చాలా మంది వచ్చారు, బ్లాక్‌ బస్టర్స్ కొట్టారు. సరికొత్త రికార్డులు సెట్‌ చేశారు.

37
`ఇంద్ర` ఫస్ట్ రూ.50కోట్ల మూవీ

పది కోట్ల రికార్డు మాత్రమే కాదు, చిరంజీవి మరో అరుదైన మైల్‌ స్టోన్‌ చేరుకున్నారు. ఫస్ట్ రూ.50కోట్ల మూవీ కూడా ఆయనదే. ఆయన హీరోగా వచ్చిన `ఇంద్ర` మూవీ ఈ రికార్డుని బ్రేక్‌ చేసింది. `ఘరానా మొగుడు` వచ్చిన పదేళ్లకి `ఇంద్ర` వచ్చింది. బి గోపాల్‌ దర్శకత్వం వహించారు. అశ్వినీదత్‌ నిర్మించారు. ఆర్తి అగర్వాల్‌, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ రూ.13కోట్లతో రూపొందింది. బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టించింది. ఏకంగా రూ.55కోట్లు రాబట్టింది. దీంతో యాభై కోట్ల రికార్డుని క్రాస్‌ చేసిన తొలి చిత్రంగా నిలిచింది.

47
`మగధీర` ఫస్ట్ రూ.100కోట్ల సినిమా

ఆ తర్వాత వంద కోట్ల క్లబ్‌ కూడా మెగా హీరోనే బ్రేక్‌ చేశారు. ఇప్పుడు రామ్‌ చరణ్‌ వంతు వచ్చింది. ఆయన హీరోగా పరిచయం అయిన తర్వాత రెండో మూవీతోనే వంద కోట్లు రాబట్టారు. రామ్‌ చరణ్‌.. రాజమౌళి దర్శకత్వంలో `మగధీర` చిత్రంలో నటించారు. కాజల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం 2009లో విడుదలైంది. ఇది ఏకంగా వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టి తెలుగులో ఆ అరుదైన రికార్డ్ ని బ్రేక్‌ చేసిన తొలి చిత్రంగా నిలిచింది.

57
`ఖైదీ నెం 150` తొలి వంద కోట్ల షేర్‌ సాధించిన మూవీ

అనంతరం పాన్‌ ఇండియా మూవీస్‌తో `బాహుబలి` సరికొత్త రికార్డులు బ్రేక్‌ చేసిన విషయం తెలిసిందే. తొలి రూ.500కోట్ల మూవీ, తొలి వెయ్యి కోట్ల మూవీ, తొలి రూ.1500కోట్ల మూవీగా `బాహుబలి` చిత్రాలు నిలిచాయి. కానీ రీజినల్‌ ఫిల్మ్స్ విషయంలో చిరంజీవి మరో రికార్డుని సృష్టించారు. వంద కోట్ల షేర్‌ని సాధించిన మూవీ ఆయనదే కావడం విశేషం. 9ఏళ్ల తర్వాత ఆయన రీ ఎంట్రీ ఇస్తూ `ఖైదీ నెం 150` చిత్రంలో నటించారు. ఈ మూవీ రూ.164కోట్ల గ్రాస్‌ సాధించింది. రూ.104కోట్ల షేర్‌ని రాబట్టింది. ఇలా వంద కోట్ల షేర్‌ని సాధించిన తొలి రీజినల్‌ ఫిల్మ్ గా `ఖైదీ నెం 150` రికార్డు సృష్టించింది.

67
`రంగస్థలం` తొలి రూ.200 కోట్ల మూవీ

రీజినల్‌ ఫిల్మ్స్ లో రెండు వందల కోట్లు రాబట్టిన చిత్రం కూడా మెగా హీరో ఖాతాలోనే ఉంది. రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన `రంగస్థలం` ఈ అరుదైన రికార్డుని సాధించింది. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం 2018లో విడుదలైంది. బాక్సాఫీసు వద్ద ఏకంగా రూ.216కోట్లు రాబట్టింది. రీజినల్‌ ఫిల్మ్స్ లో రెండు వందల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా రామ్‌ చరణ్‌ `రంగస్థలం` నిలిచింది.

77
`మన శంకర వర ప్రసాద్‌ గారు` తొలి రూ.300కోట్ల మూవీ

ఇక ఇప్పుడు చిరంజీవి వంతు వచ్చింది. రీజినల్‌ ఫిల్మ్స్ లో తొలి రూ.300కోట్లు రాబట్టింది చిరు మూవీనే. ఆయన ఇటీవల నటించిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూడు వందల కోట్ల క్లబ్‌లో చేరింది. రీజినల్‌ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా, వెంకటేష్‌ స్పెషల్‌ రోల్‌ చేశారు. ఈ సంక్రాంతికి ఈ చిత్రం విడుదలై బాక్సాఫీసుని షేక్‌ చేసిన విషయం తెలిసిందే. ఇలా తండ్రీ కొడుకు ఇండస్ట్రీలో బెంచ్‌ మార్క్ లు సెట్‌ చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో మెగా హీరోలు అల్లు అర్జున్‌, పవన్‌ కళ్యాణ్‌లకు కూడా ఈ రికార్డులు సాధ్యం కాలేదని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories