Anakapalli Movie Review: అనకాపల్లి మూవీ రివ్యూ.. విలన్‌ని హీరోయిన్‌ ప్రేమిస్తే, హీరో ఏం చేశాడు?

Published : Oct 02, 2026, 11:06 PM IST

విక్రమ్‌ సహిదేవ్‌, సంధ్యా వశిష్ట జంటగా, త్రినాథ రావు కథ, నిర్మాత, నటుడిగా చేసిన చిత్రం `అనకాపల్లి`. గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్‌ అయిన ఈ చిత్రం ఎలా ఉందంటే?

PREV
16
అనకాపల్లి మూవీ రివ్యూ

ప్రముఖ దర్శకుడు త్రినాథ రావు నక్కిన కథ అందిస్తూ నటించిన మూవీ `అనకాపల్లి`. ఇందులో విక్రమ్‌ సహిదేవ్‌ హీరోగా నటించగా, సంధ్యా వశిష్ట హీరోయిన్‌గా నటించింది. త్రినాథ రావు నక్కినతోపాటు ఇంద్రజ, తారక్‌ పొన్నప్ప, మహబూబ్‌ బాషా, వడ్లమాని శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషించారు. భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ పతాకాలపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించారు. కాగేష్‌ తమ్మినేని దర్శకత్వం వహించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(అక్టోబర్‌ 2) విడుదలైంది. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్‌ లవ్‌ స్టోరీ ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
అనకాపల్లి మూవీ కథ

అనకాపల్లిలో రెండు ఊర్లకు తరచూ గొడవలు జరుగుతుంటాయి. అనకాపల్లికి చెందిన సూర్య(విక్రమ్‌ సహిదేవ్‌) ఆ గొడవలకు దూరంగా ఉంటాడు. వాళ్ల నాన్న కరెంట్‌ ఏఈ సాంబశివరావు(త్రినాథరావు నక్కిన). అమ్మ(ఇంద్రజ) హౌజ్‌ వైఫ్‌. ఆ ఊర్లో బుల్లెట్‌(తారక్‌ పొన్నప్ప)కి మంచి హవా ఉంటుంది. మహేష్‌ బాబు బిజినెస్‌ మ్యాన్‌ సినిమా చూడ్డానికి వెళితే సూర్యకి టికెట్లు ఇవ్వరు. కానీ బుల్లెట్‌ వచ్చి డాన్స్ చేసి బెదిరిస్తే టికెట్లు తెచ్చి ఇస్తాడు మేనేజర్‌. అది చూసిన సూర్య బుల్లెట్‌కి అభిమాని అయిపోతాడు. ఆయన్ని ఫాలో అవుతాడు. ఆయనలా బతకాలని ఫిక్స్ అవుతాడు. నువ్వు ఏం చెప్పినా చేస్తానని చెప్పి బుల్లెట్‌ వద్ద సహాయకుడిగా చేరతాడు. బుల్లెట్‌ చిన్నపాటి చీకటి సామ్రాజ్యాన్ని నడిపిస్తుంటాడు. మెయిన్ గా గంజాయి, మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తాడు. ఎమ్మెల్యే(వడ్లమాని శ్రీనివాస్‌) అనుచరుడినే దెబ్బకొడతాడు.

ఈ క్రమంలో బుల్లెట్‌కి బాగా దగ్గరవుతాడు సూర్య. వారి వ్యాపారంలోనూ భాగమవుతాడు. ఈ క్రమంలో సూర్యకి అమృత(సంధ్యా వశిష్ట) పరిచయం అవుతుంది. ఆమెకి కరెంట్‌ మీటర్‌ కోసం హెల్ప్ చేస్తాడు సూర్య. అంతేకాదు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా తనని ప్రేమిస్తుందని భావిస్తాడు. కానీ ఊహించని విధంగా వాలెంటైన్స్ రోజు తన బుల్లెట్‌తో సినిమాకి వెళ్తుంది. ఆయన్ని ప్రేమిస్తున్నానని చెబుతుంది. దీంతో సూర్య రియాక్షన్‌ ఏంటి? సొంత అన్నలా భావించే బుల్లెట్‌తో సూర్యకి ఎక్కడ చెడింది? ఇందులో ఎమ్మెల్యే ఇన్‌వాల్వ్ మెంట్‌ ఏంటి? సూర్య విషయంలో వాళ్ల అమ్మానాన్న ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అనేది మిగిలిన సినిమా.

36
అనకాపల్లి మూవీ విశ్లేషణ

విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే యాక్షన్‌, లవ్‌ స్టోరీ ఇది. అందులో చీకటి సామ్రాజ్యాలు, మాదక ద్రవ్యాల వ్యాపారం, ఆ ఊబిలోకి హీరో వెళ్లడం, ఈ క్రమంలో పేరెంట్స్ మధ్య, ప్రియురాలి మధ్య, తనకు లైఫ్‌ ఇచ్చిన విలన్‌ మధ్య ఎలా నలిగిపోయాడు? దాన్నుంచి బయటపడ్డాడా లేదా అనే దానిపై కథ నడుస్తుంది. యాక్షన్‌ ప్రధానంగా సాగినా, ఇందులో ప్రేమ కథకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి విలన్‌ని ప్రేమించడం ఇందులో హైలైట్‌ పాయింట్‌గా చెప్పొచ్చు. కథగా ఇది ఆసక్తికరంగా ఉంది. విలన్‌ని హీరోయిన్‌ ప్రేమించే కథలు చాలానే వచ్చినా, ఇటీవల కాలంలో మాత్రం ఇది కొత్తది అని చెప్పొచ్చు. సినిమా ప్రారంభం ఆసక్తికరంగా స్టార్ట్ అవుతుంది. హీరోకి సినిమాల పిచ్చి.. విలన్‌కి దగ్గరగా చేయడం, తాను కూడా విలన్‌లా మారిపోవడం, ఆ తర్వాత ప్రేమలో పడటం వంటి అంశాలు ఆకట్టుకుంటాయి. లవ్‌ ట్రాక్‌ కొంత రొటీన్‌గానే ఉన్నా, దాన్ని తెరపై చూపించిన తీరు బాగుంది. ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్‌ చేసే సమయంలో ఆమె విలన్‌కి దగ్గరయ్యే ట్విస్ట్ షాకిస్తుంది. ఆ తర్వాతనే కథనం ట్రాక్‌ తప్పినట్టుగా ఉంది. లాజిక్‌ లెస్‌గా ఉంటుంది. ప్రేమ విషయంలో హీరోహీరోయిన్ల మధ్య జరిగే కన్వర్జేషన్‌ క్రేజీగా ఉన్నా, కన్విన్సింగ్‌గా అనిపించదు. హీరో బ్రేకప్‌లా ఫీలవడం కొంత రొటీన్‌గానే ఉంటుంది. క్లైమాక్స్ లో సినిమా పుంజుకుంది. వాహ్‌ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ కన్‌క్లూజన్‌ మాత్రం మళ్లీ ట్రాక్‌ తప్పినట్టుగా ఉంటుంది. హీరో కోసం మారిన హీరోయిన్‌ చివర్లో ఇచ్చిన ట్విస్ట్ ఏమాత్రం కన్విన్సింగ్‌గా లేదు. లాజిక్‌ లెస్‌గా ఉంది. సినిమాపై అప్పటి వరకు ఉన్న ఇంపాక్ట్ ని దెబ్బతీసేలా ఉంది. మధ్యలో కథనం కొంత సాగదీసినట్టుగా, మరికొంత రొటీన్‌గా ఉంటుంది. ఎమోషన్స్ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. పేరెంట్స్ కి సంబంధించిన ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. హృదయాన్ని కదిలిస్తాయి. అదే స్థాయిలో ఎండింగ్‌ ఉండి ఉంటే ఇంకా బాగుండేది.

46
అనకాపల్లి మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

సూర్య పాత్రలో విక్రమ్‌ సహిదేవ్‌ నటుడిగా మెప్పించాడు. చాలా బాగా నటించాడు. చాలా మెచ్యూర్డ్ గా చేశాడు. కుర్రాడిగా, లవర్‌గా, గ్యాంగ్‌ స్టర్‌గా, ఇన్నోసెంట్‌ కొడుకుగా ఇలా విభిన్నమైన ఎమోషన్స్ ని, భావోద్వేగాలను పలికించాడు. యాక్షన్‌తోనూ అదరగొట్టాడు. ఎక్కడా ఓవర్‌ యాక్షన్‌కి వెళ్లకుండా, ఇమేజ్‌, ఎలివేషన్‌ లు అనే దానికి వెళ్లకుండా చాలా సెటిల్డ్ గా చేసి మెప్పించాడు. నటుడిగా మంచి ఫ్యూచర్‌ ఉందని చెప్పొచ్చు. అతని నటనే సినిమాకి మెయిన్‌ బలం. ఇక హీరోయిన్‌గా సంధ్యా వశిష్ట నటన కూడా బాగుంది. ఆమె కూడా అంతే సహజంగా నటించి మెప్పించింది. ఆమె పాత్రలోని ట్విస్ట్ బాగుంది. విలన్‌ పాత్రలో తారక్‌ పొన్నప్ప నటన అదిరిపోయింది. చాలా చోట్ల అతని పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది. అతను కూడా అదే స్థాయిలో నటించి మెప్పించాడు. హీరో తండ్రిగా త్రినాథరావు నక్కిన పాత్రలో ఒదిగిపోయాడు. నటుడిగా ఆయనకు మంచి భవిష్యత్‌ ఉందని చెప్పొచ్చు. తల్లిగా ఇంద్రజ యాప్ట్ గా నిలిచింది. ఎమ్మెల్యేగా వడ్లమాని శ్రీనివాస్‌ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హీరో ఫ్రెండ్‌గా చేసిన మహబూబ్‌ బాషా సైతం మెప్పించాడు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

56
అనకాపల్లి మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

కథ కమర్షియల్‌గా ఉన్నా బాగుంది. దాన్ని తీసిన విధానం బాగుంది. దర్శకుడు కాగేష్‌ తమ్మినేని అంతే బాగా తెరకెక్కించాడు. అయితే కొంత రొటీన్‌గా నడిపించినా చాలా చోట్ల బాగుంది. ఫీల్‌, డ్రామా, యాక్షన్‌, ఎమోషన్స్ బాగున్నాయి. దావ్‌జాండ్‌ సంగీతం ఫర్వాలేదు. పాటలు బాగున్నాయి. ఆర్‌ఆర్‌ కూడా అదిరిపోయింది. వంశీ కృష్ణ కెమెరా వర్క్ ఆకట్టుకుంది. రిచ్‌ లుక్‌ని ఇచ్చింది. శ్రీ కృష్ణ అట్టలూరి ఎడిటింగ్‌ ఫర్వాలేదు. కొంత ట్రిమ్‌ చేయోచ్చు. నిర్మాణ విలువలకు కొదవ లేదు. సినిమా బాగా తీశారు.

66
ఫైనల్‌గా

కొంత రొటీన్‌ ఉన్నా, సరికొత్త యాక్షన్‌ లవ్‌ స్టోరీగా ఈ చిత్రం మెప్పిస్తుంది. ఈ వారం వచ్చిన వాటిలో బెటర్‌గా నిలుస్తుంది.

రేటింగ్‌: 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories