బాలకృష్ణకి చెమటలు పట్టించిన లవర్‌ బాయ్‌.. బాలనటుడేగా అని వదిలేస్తే కోలుకోలేని దెబ్బ

Published : Jul 28, 2025, 05:47 PM IST

బాలకృష్ణ `సీమసింహం` సినిమా విషయంలో కోలుకోలేని దెబ్బ తిన్నాడు. తన మూవీలోని బాలనటుడే ఆయనకు పెద్ద ఎసరు పెట్టడం విశేషం. ఆ విషయాలు తెలుసుకుందాం. 

PREV
15
లవర్‌ బాయ్‌తో పోటీలో బోల్తా పడ్డ బాలయ్య

బాలకృష్ణ తన కెరీర్‌లో చాలా పరాజయాలు చూశారు. అదే సమయంలో బ్లాక్‌ బస్టర్స్ చూశారు. కొన్ని ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. అయితే కొన్ని సార్లు చిన్న హీరోలతో పోటీపడి బోల్తా పడ్డ సందర్భాలున్నాయి.

 అలా తన సినిమాలో బాలనటుడిగా నటించిన ఒక హీరో ఆ తర్వాత హీరోగా సినిమా చేసి తన సినిమాకే ఎసరు పెట్టారు. లవర్‌ బాయ్‌గా రాణిస్తూ బాలయ్యని గట్టి దెబ్బకొట్టాడు. మరి ఆ హీరో ఎవరు? ఆ కథేంటో చూద్దాం. 

DID YOU KNOW ?
`అఖండ 2`తో రాబోతున్న బాలయ్య
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ 2`లో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 25న విడుదల కాబోతుంది.
25
పదేళ్ల తర్వాత హిట్‌ కొట్టి బాలయ్య

బాలకృష్ణ ఇప్పటి వరకు సుమారు 110 సినిమాలు చేశారు. ఇటీవల వరుసగా నాలుగు హిట్లతో ‌జోరు మీదున్నారు. ఆయన సినిమాలన్నీ ఇప్పుడు బాక్సాఫీసు వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. 

అయితే అంతకు ముందు పరిస్థితి వేరు. ఒక్క హిట్‌ వస్తే, ఏడెనిమిది, పది పరాజయాలు వెంటాడాయి. `నరసింహనాయుడు` తర్వాత ఆయనకు ఆ రేంజ్‌ హిట్ పడటానికి దాదాపు పదేళ్లు పట్టింది.

35
`సీమసింహం`తో పరాజయం చవిచూసిన బాలయ్య

`నరసింహనాయుడు` తర్వాత `భలేవాడివి బాసు` చిత్రంతో ఫ్లాప్‌ అందుకున్నారు. దీంతో మళ్లీ రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లోనే `సీమసింహం` సినిమా చేశారు బాలయ్య. 

కానీ ఈ చిత్రం కూడా ఆదరణ పొందలేదు. డిజాస్టర్‌గా నిలిచింది. `సీమసింహం` మూవీ 2002 సంక్రాంతి 11కి విడుదలైంది. జీ రామ్‌ ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్యతోపాటు సిమ్రాన్‌, రిమా సేన్‌ హీరోయిన్లుగా నటించారు. 

ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ మూవీ పరాజయం వెనుక మరో హీరో కూడా ఉన్నారు.

45
`నువ్వులేక నేను లేను`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న తరుణ్‌

అదే సంక్రాంతికి మూడు రోజుల గ్యాప్‌తో జనవరి 14న లవర్‌ బాయ్‌ తరుణ్‌ నటించిన `నువ్వు లేక నేను లేను` సినిమా విడుదలైంది. తరుణ్‌, ఆర్తి అగర్వాల్‌ జంటగా నటించిన ఈ మూవీకి వై కాశీ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. 

ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో తరుణ్‌ లవర్‌ బాయ్‌ గా ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. 

వరుసగా విజయాలతో స్టార్‌గా రాణిస్తున్నారు. లవర్‌ బాయ్‌గా యూత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. పైగా పండగ సమయంలో వచ్చిన మూవీ కావడంతో ఆడియెన్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు.

55
బాలయ్యని కోలుకోలేని దెబ్బ కొట్టిన తరుణ్‌

అలా బాలయ్య `సీమసింహం` మూవీకి తరుణ్‌ తన `నువ్వు లేక నేను లేను` మూవీతో గట్టి దెబ్బ కొట్టాడు. ఇంకా చెప్పాలంటే కోలుకోలేని దెబ్బ కొట్టాడు. 

ఆ తర్వాత బాలయ్యకి దాదాపు పదేళ్ల తర్వాత `సింహ`తో మళ్లీ హిట్‌ అందుకున్నారు బాలయ్య. 

ఇదిలా ఉంటే బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన `ఆదిత్య 369` చిత్రంలో తరుణ్‌ బాలనటుడిగా నటించడం విశేషం. అలా బాలయ్య బాలనటుడేలే అని వదిలేస్తే తన సినిమాకే ఎసరు పెట్టాడు తరుణ్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories