Irumudi: ఇరుముడి మూవీకి చిరంజీవి రివ్యూ, ఇండస్ట్రీ ఏ కొందరిదో కాదు..మెగాస్టార్ నుంచి అస్సలు ఊహించని కామెంట్

Published : Aug 27, 2026, 04:50 PM IST

ఇరుముడి సినిమాను పూర్తిగా ఆస్వాదించానని చిరంజీవి తెలిపారు. రవితేజ నటనను, శివ నిర్వాణ దర్శకత్వాన్ని ప్రశంసిస్తూ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో చిరంజీవి ఎవ్వరూ ఊహించని కామెంట్ కూడా చేశారు.

PREV
15
Ravi Teja

తాజా తెలుగు బ్లాక్‌బస్టర్‌ ఇరుముడి బాక్సాఫీస్‌ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. యశ్‌ నటించిన టాక్సిక్‌ సినిమాతో పోటీ ఉన్నప్పటికీ ఈ చిత్రం ఇప్పటికే ఆరు రోజుల ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా సినిమాకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఇరుముడి విజయాన్ని ప్రశంసించారు. సినిమా విడుదలైన రోజే నిర్మాతలకు ఫోన్‌ చేసి విజయంపై అభినందనలు తెలిపిన చిరంజీవి, తాజాగా ఎక్స్‌ వేదికగా తన స్పందనను పంచుకున్నారు.

25
రవితేజపై ప్రత్యేకంగా ప్రశంసలు

ఇరుముడి సినిమాను మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా ఆస్వాదించానని చిరంజీవి తెలిపారు. ఇందులో త్రినాథ్‌ పాత్రలో నటించిన రవితేజపై ఆయన ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఆ పాత్రను రవితేజ పూర్తిగా తన భుజాలపై మోశారని కొనియాడారు. అలాగే దర్శకుడు శివ నిర్వాణ సినిమాను ఎంతో లోతైన భావోద్వేగాలతో తెరకెక్కించిన విధానాన్ని చిరంజీవి ప్రశంసించారు. బాలనటి బేబీ నక్షత్రకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు సహా మొత్తం చిత్రబృందానికి చిరంజీవి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

35
రూ.120 కోట్లకు పైగా గ్రాస్‌

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థకు చెందిన నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌లను కూడా చిరంజీవి అభినందించారు. ఇరుముడి సాధించిన విజయానికి వారు అర్హులని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.120 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు సమాచారం. వారాంతంలో కూడా సినిమాకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో రూ.200 కోట్ల గ్రాస్‌ మార్క్‌ దిశగా ఇరుముడి అడుగులు వేస్తోంది. టాక్సిక్‌ వంటి భారీ చిత్రంతో పోటీ ఉన్నప్పటికీ ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం చిత్రబృందానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది.

45
ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు

చిరంజీవి తన ఎక్స్‌ పోస్టు చివర్లో సినిమా విజయానికి మించిన విస్తృతమైన సందేశాన్ని కూడా ఇచ్చారు. ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి! అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సినిమా పరిశ్రమలో ఒక చిత్రం విజయాన్ని కేవలం కొందరి విజయంగా కాకుండా మొత్తం పరిశ్రమకు సంబంధించిన వేడుకగా చూడాలని ఆయన పేర్కొన్న ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇతరులు కూడా ఎదగడానికి అవకాశం ఇవ్వాలనే భావనను చిరంజీవి తన పోస్టు ద్వారా వ్యక్తం చేశారు.

55
టాక్సిక్ వర్సెస్ ఇరుముడి

ఇరుముడి, టాక్సిక్ సినిమాల విషయంలో వివాదం నెలకొంది. డబ్బింగ్ సినిమా అయిన టాక్సిక్ కి థియేటర్స్ కేటాయిస్తూ హౌస్ ఫుల్స్ తో రన్ అవుతున్న ఇరుముడి చిత్రాన్ని తొలగిస్తున్నారు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. టాక్సిక్ సినిమాని దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేశారు. అందుకే దిల్ రాజు కి చెందిన థియేటర్స్ మొత్తం టాక్సిక్ కి కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి గురించి చిరంజీవి పరోక్షంగా ఇలా ట్వీట్ చేసినట్లు అభిమానులు భావిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories