చిరంజీవి విలన్, వేశ్యగా శ్రీదేవి, హీరోగా శోభన్ బాబు.. దారుణాలన్నీ ఉన్న ఆ మూవీ ఏంటో తెలుసా ?

Published : Sep 08, 2025, 07:40 AM IST

అతిలోక సుందరి శ్రీదేవికి చిరంజీవి విలన్ గా నటించారు అంటే నమ్మగలరా ? కానీ ఇది నిజం. ఆ మూవీ ఏంటి, హీరో ఎవరు లాంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ బిగినింగ్ లో ఎలాంటి పాత్ర వచ్చినా చేశారు. ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకున్నారు. విలన్ క్యారెక్టర్లు కూడా చేశారు. ఇప్పుడైతే అభిమానులు చిరంజీవిని విలన్ గా అసలు ఊహించుకోలేరు. కానీ కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి విలన్ గా నటించిన సినిమాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా మోసగాడు అనే చిత్రం గురించి చెప్పుకోవాలి. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ అనే అభిమానులు అపురూప దృశ్యకావ్యం జగదేక వీరుడు అతిలోక సుందరి గుర్తుకు వస్తుంది. 

25

ఈ మూవీలో చిరంజీవి, శ్రీదేవి మధ్య కెమిస్ట్రీ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉంటుంది. అలాంటి చిరంజీవి కెరీర్ ఆరంభంలో శ్రీదేవికి విలన్ గా నటించారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే మోసగాడు. ఈ మూవీలో హీరో శోభన్ బాబు. శ్రీదేవి, శోభన్ బాబు లకు చిరంజీవివిలన్ అని వినడమే బాగాలేదు.. అలాంటిది ఆ చిత్రంలో చాలా దారుణాలు ఉన్నాయి. మూవీ ట్రాజిడీ ఎండింగ్ తో ఉంటుంది. 

35

శ్రీదేవి అక్కా చెల్లెళ్లుగా డ్యూయెల్ రోల్ లో నటించింది. ఒక పాత్రలో శ్రీదేవి డబ్బు కోసం ఏమైనా చేసే వేశ్యగా నటిస్తుంది. మరో పాత్రలో సమాజంలో గౌరవప్రదంగా అందరి మహిళల్లాగా పెళ్లి చేసుకుని జీవించాలని కోరుకునే అమ్మాయిగా నటించింది. ఆమె ప్రియుడిగా శోభన్ బాబు నటించారు. ఒకసారి విలన్ అయిన చిరంజీవికి, శ్రీదేవికి గొడవ జరుగుతుంది. దీనితో చిరంజీవి ఆమెపై పగ పెంచుకుంటారు. 

45

శ్రీదేవి, శోభన్ బాబు గుడిలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. వేశ్య పాత్రలో ఉన్న శ్రీదేవి తన చెల్లి ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోబోతోంది అని తెలిసి సంతోషిస్తుంది. గుడిలో పెళ్ళికి సిద్దమయ్యాక ఒకసారి ఒంటరిగా ఉన్న శ్రీదేవిపై చిరంజీవి లైంగిక దాడి చేస్తారు. ఆ అవమానంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. చిరంజీవిపై పగ పంచుకున్న శోభన్ బాబు అతడిని అంతం చేస్తాడు. దీనితో శోభన్ బాబుకి ఉరిశిక్ష పడుతుంది. ఈ విధంగా మూవీ ట్రాజెడీగా ఎండ్ అవుతుంది. 

55

కథ వింటుంటే దారుణాలన్నీ ఈ చిత్రంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరో కాదు.. రాఘవేంద్ర రావు. కైకాల సత్యనారాయణ, ముమ్మడి ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్రీదేవి వేశ్యగా నటించిన పాత్రలో చాలా బోల్డ్ గా కనిపించింది. అప్పట్లోనే ఆమె ఈ చిత్రంలో స్మోకింగ్ సన్నివేశాల్లో నటించింది. 

Read more Photos on
click me!

Recommended Stories