80ల ప్రారంభంలో చిరంజీవి నటుడిగా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నాడు. విలన్, సపోర్టింగ్ క్యారెక్టర్, హీరో... ఇలా వచ్చిన ప్రతి పాత్ర చేసేవాడు చిరంజీవి. అయితే తన పాత్రకు ఎంతో కొంత ప్రాధాన్యత ఉండేలా చూసుకునేవాడు. 1980లో వచ్చిన పున్నమి నాగు సూపర్ హిట్. చిరంజీవి పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుంది. నరసింహరాజు హీరోగా చేశాడు.
చిరంజీవి వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటూ పరిశ్రమ దృష్టిలో పడ్డాడు. ముఖ్యంగా చిరంజీవి బాగా డాన్స్ చేస్తాడనే పేరు పడింది. చిరంజీవి ఫైట్స్ కూడా దుమ్ము రేపేవాడు. ఎంత ప్రతిభ ఉన్నా... అది నిరూపించుకునే సినిమా పడాలి. ఖైదీ చిరంజీవి గతిని మార్చేసింది. చిరంజీవిలోని ఫైర్ ని బయటపెట్టింది.
1983లో వచ్చిన ఖైదీ మూవీ చిరంజీవి ఇమేజ్ పూర్తిగా మార్చేసింది. ఆయన కెరీర్ కి గట్టి పునాది వేసింది. దర్శకుడు ఏ కోందండరామిరెడ్డి తెరకెక్కించాడు. మాధవి హీరోయిన్ గా చేసింది. అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్, సాంగ్స్, ఎమోషన్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. వెరసి ఖైదీ టాలీవుడ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఖైదీ హాలీవుడ్ మూవీ ఫస్ట్ బ్లడ్ స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రం.
Khaidi Movie
అయితే ఈ కథ మొదట సూపర్ స్టార్ కృష్ణ వద్దకు వెళ్లిందట. స్క్రిప్ట్ విన్నాక కృష్ణ ఓ సూచన చేశారట. చిరంజీవి బాగా డాన్సులు చేస్తాడు. అతనికి ఈ స్క్రిప్ట్ బాగా సెట్ అవుతుందని సలహా ఇచ్చాడట. దాంతో దర్శకుడు కోదండరామిరెడ్డి కృష్ణ సలహా మేరకు చిరంజీవితో ఖైదీ చేసి భారీ విజయం అందుకున్నారు.
ఈ విషయాన్ని కృష్ణ మేకప్ మ్యాన్ మాధవరావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాబట్టి చిరంజీవి స్టార్ గా ఎదగడానికి కారణమైన ఒక గొప్ప ప్రాజెక్ట్ కృష్ణ కారణంగా ఆయనకు దక్కింది. కృష్ణ తన వద్దకు వచ్చిన కథల్లో కొన్నిటిని ఇతర హీరోలతో చేస్తే బాగుంటుందని సూచించేవారట. కృష్ణంరాజు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కటకటాల రుద్రయ్య సైతం కృష్ణ చేయాల్సి ఉండగా.. కృష్ణంరాజుతో చేయమని దర్శకుడికి కృష్ణ చెప్పారట.