చిరంజీవి నాకు ఎలాంటి సాయం చేయలేదు.. నటి లయ షాకింగ్‌ కామెంట్స్‌.. పారితోషికం ఇవ్వకుండా ఎగ్గొట్టారు..

First Published | Feb 21, 2024, 10:44 AM IST

కామెడీ సినిమాలతో అలరించిన నటి లయ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆయన సహాయంపై, పారితోషికంపై షాకింగ్‌ కామెంట్స్ చేసింది. ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

నటి లయ ఇరవై ఏళ్ల క్రితం టాలీవుడ్‌ని ఊపేసింది. టైర్‌ 2 హీరోలందరితోనూ నటించి ఆకట్టుకుంది. హోమ్లీ బ్యూటీగా తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. తన సెకండ్‌ ఇన్నింగ్స్ ని ప్రారంభించాలనుకుంటుంది. మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ(రియల్‌ టాక్స్ విత్‌ అంజి)లో పాల్గొంది లయ. ఇందులో పలు షాకింగ్‌ విషయాలను, మరికొన్ని ఆశ్చర్యపరిచే విషయాలను పంచుకుంది. అప్పట్లో జరిగిన ట్రోల్స్ ని ఆమె ఓపెన్‌గా చెప్పింది. ప్రస్తుతం ఆయా విషయాలు వైరల్‌గా మారాయి. అయితే ఇందులో చిరంజీవి విషయం కూడా ఉండటం విశేషం. 


నటి లయకి మొహమాటం ఎక్కువ. అవకాశాలుగానీ, రెమ్యూనరేషన్‌ గానీ ఓపెన్‌గా అడగలేదు. ఏమనుకుంటారో అనే బిడియం ఉంటుంది. అలా చాలా ఆఫర్లని ఆమె కోల్పోయిందట. తనకు సరైన పీఆర్‌ లేకపోవడంతో చాలా అవకాశాలను దక్కించుకోలేకపోయానని, వచ్చిన ఆఫర్లు, వాటిలో నచ్చినవి చేసుకుంటూ వచ్చానని తెలిపింది లయ. 
 

అయితే కొన్ని సినిమాలకు పారితోషికాలు ఎగ్గొట్టారని చెప్పింది. చాలా మంది నిర్మాతలు సినిమా అయిపోయాక పారితోషికం ఇవ్వకుండా ఎగ్గొట్టారని తెలిపింది లయ. ఈ సందర్భంగా ఓ సినిమా గురించి చెప్పుకొచ్చింది. `వాళ్లు కూడా రెమ్యూనరేషన్‌ ఇవ్వలేదు. వాళ్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు. కనీసం నా స్టాఫ్‌ పేమెంట్‌ కూడా ఇవ్వలేదు. మిగిలిన వాళ్లకి ఇస్తున్నారు, నాకు ఇవ్వడం లేదు. దీంతో తట్టుకోలేక మీరు ఇస్తేనే వస్తాను, లేదంటే రాను అని తెగేసి చెప్పిందట.

మధ్యహ్నం అవుతుంది రెస్పాన్స్ లేదు. ఇంతలోనే నాన్న కాల్‌ చేశారు. ఇలా పారితోషికం ఇవ్వడం లేదు అని వెళ్లడం లేదు అని తెలిసి ఆయన నాపై సీరియస్‌ అయ్యారు. నీకేంటి డాక్టర్‌ కూతురువి, డబ్బుల కోసం వెళ్తున్నావా? డబ్బులు మనకులేవా?, పని ముఖ్యం అని, నీ వల్ల వర్క్ ఆగిపోతుంది, చాలా మందితో కూడి వ్యవహారం అని గట్టిగా చెప్పడంతో ఇక తాను షూటింగ్‌కి వెళ్లాను. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు అలా చేయలేదు, ఇస్తే ఇచ్చారు లేదంటే లైట్‌ అనేలా వెళ్లిపోయాను` అని తెలిపింది లయ. 
 

నెక్ట్స్ ప్రాజెక్ట్ చేద్దామని చెబుతుంటారని, కానీ ఆ నెక్ట్స్ ప్రాజెక్ట్ కి మనల్ని తీసుకోరని, వేరేవాళ్లతో చేస్తారని, వాళ్లకి మాత్రం పారితోషికాలు ఇస్తారని చెప్పింది. అలా తెలిసినప్పుడు చాలా బాధగా ఉంటుందని పేర్కొంది. అంతేకాదు తనకు వేల కోట్లు ఉందని, లగ్జరీ లైఫ్‌ అనుభవిస్తున్నట్టు సోషల్‌ మీడియాలో వచ్చే కామెంట్లు, యూట్యూబ్‌ వీడియోలపై స్పందిస్తూ పంచ్‌లు విసిరింది. అంబానీ మాకు చుట్టమనే అని, రోజూ ఫ్లైట్‌లోనే తాను తిరుగుతాను అని, తనకు సొంతంగా ఫ్లైట్స్ ఉన్నాయంటూ సెటైర్లు పేల్చింది.  
 

ఈ సందర్భంగా తన వద్ద డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నట్టు సోషల్‌ మీడియాలో కామెంట్లు, యూట్యూబ్‌లో వీడియోలు, థంబ్‌నెయిల్స్ పెట్టడంపై ఆమె స్పందిస్తూ అలాంటివి చూసినప్పుడు చాలా బాధగా ఉంటుందని, తనకు డబ్బుల్లేని పరిస్థితి లేదని, తమ పేరెంట్స్ డాక్టర్స్ అని,డబ్బులకు కొదవ లేదని, కానీ అడ్డుకునే పరిస్థితిలో లేమని చెప్పింది. చిరంజీవి వద్ద డబ్బులు అడ్డుకున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని, ఆయన తనకు ఎలాంటి సాయం చేయలేదని తెలిపింది.

చిరంజీవి సహయం చేస్తుంటారు. కానీ తనకు సహాయం చేయలేదని, తనకు ఆ అవసరం లేదని, ఆ స్థితిలో తాము లేమని చెప్పింది. కానీ తనపై లేని పోని గాసిప్పులను క్రియేట్‌ చేయడంపై ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యింది. అవన్నీ సిల్లీగా ఉంటాయని, ఇలా ఎలా ఉంటారు ఎవరైనా, ఎలా చూస్తారని అవి పెట్టారో, అవి మిలియన్స్ వ్యూస్‌ ఎలా వెళ్లిపోయాయో అర్థం కావడం లేదు. మనం చెప్పేది కంచెమైనా నేచురల్‌గా ఉండాలి, నిజం ఉండాలి కదా, కానీ అలా బతికి ఏం లాభమో నాకు తెలియదు` అని అసహనం వ్యక్తం చేసింది లయ. ఎలాంటి సమస్య ఉన్నా, చేయకూడని పనుల్లో అది ఒకటని తానుభావిస్తానని తెలిపింది లయ. 
 

విజయవాడకి చెందిన నటి లయ పేరెంట్స్ డాక్టర్స్. చిన్నప్పట్నుంచే మంచి లైఫ్‌ని అనుభవించింది. సినిమాపై ఫ్యాషన్‌తో ఆమె ఈ రంగంలోకి వచ్చింది. నటిగా మెప్పించింది.  1992లో చైల్డ్ ఆర్టిస్ట్ గా `భద్రం కొడుకో` చిత్రంలో నటించింది. ఆ తర్వాత వేణు తొట్టేంపుడితో కలిసి `స్వయంవరం` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. అలా `మనోహరం`, `మనసున్న మారాజు`, `కోదండ రాముడు`, `దేవుళ్లు`, `రామా చిలకమ్మ`, `హనుమాన్‌ జంక్షన్‌`, `ప్రేమించు`, `మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది`, `నాలో ఉన్న ప్రేమ`, `కొండవీటి సింహాసనం`, `శివ రామరాజు`, `నువ్వు లేక నేను లేను`, `మిస్సమ్మ`, `పెళ్లాంతో పనేంటి`, `విజయేంద్ర వర్మ`, `స్వరాభిషేకం`, `అదిరిందయ్య చంద్రం`, `టాటా బీర్లా మధ్యలో లైలా` చిత్రాల్లో నటించింది. చివరగా ఆమె `బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం` సినిమా చేసింది. చాలా వరకు కామెడీ చిత్రాలతో మెప్పించింది. 
 

Latest Videos

click me!