మరోసారి నిర్మాణం వైపు వెళ్లకుండా చేసింది. అదే హ్యాండ్సప్ మూవీ. 1999లో విడుదలైన హ్యాండ్సప్ చిత్రం జయసుధకు తీవ్ర నష్టాలు తెచ్చిపెట్టింది. ఈ మూవీలో భారీ తారాగణం నటించారు. జయసుధ, బ్రహ్మానందం, నాగబాబు ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్ చేశాడు. ఆయన జయసుధ భర్తగా క్లైమాక్స్ లో కనిపిస్తాడు.
కోట, గిరిబాబు, ఎల్బీ శ్రీరామ్, సోనూ సూద్, తనికెళ్ళ భరణి ఇలా పలువురు స్టార్ కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ ఈ చిత్రంలో నటించారు. దర్శకుడు శివ నాగేశ్వరరావు అవుట్ అండ్ అవుట్ క్రైమ్ కామెడీ డ్రామాగా తెరకెక్కించారు. ఓ హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో హ్యాండ్సప్ తెరకెక్కించనట్లు సమాచారం. కాగా జయసుధ ఈ చిత్రానికి స్వయంగా కథ సమకూర్చారు. వెరసి భారీ బడ్జెట్ తో మూవీ నిర్మించారు.