చిరంజీవి స్వయంకృషితో ఎదిగిన హీరో. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనని తాను నటుడిగా మలుచుకుంటూ రాణించాడు. వెండితెరపై తన నటన, డాన్సులు, ఫైట్లతో మ్యాజిక్ చేస్తూ కమర్షియల్ హీరోగా ఎదిగాడు. తెలుగు సినిమాని కమర్షియల్ బాట పట్టించాడు. సుప్రీం స్టార్ నుంచి సూపర్ స్టార్, అట్నుంచి మెగాస్టార్ గా ఎదిగారు. గత మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమా శాషిస్తున్నాడు. ఇప్పుడు తర్వాత తరం హీరోలు పాన్ ఇండియా బాటలో దూసుకుపోతున్నా, తన క్రేజ్, తన రేంజ్ మాత్రం తగ్గలేదని నిరూపించుకుంటున్నారు.