Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ పై బాడీ షేమింగ్ కామెంట్స్.. అంత దారుణంగా అనేవారంట!

First Published | Feb 10, 2024, 12:03 AM IST

క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా షాకింగ్ మేటర్ లీక్ చేసింది. తను కూడా ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ కు గురైనట్టు చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

సౌత్ లో వరుస చిత్రాలతో క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ Mrunal Thakur అలరిస్తున్న విషయంతో తెలిసిందే. అటు బాలీవుడ్ లోనూ ఇప్పుడు మంచి ఆఫర్లనే అందుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంటోంది. 
 

‘సీతారామం’తో తెలుగు ఆడియెన్స్ తో మంచి గుర్తింపు పొందింది. తన పెర్ఫామెన్స్ తో  దెబ్బకు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. దక్షిణాదిలో ఈ ముద్దుగుమ్మకు స్పెషల్ ఇమేజ్ ఏర్పడింది. అదే రేంజ్ లో సినిమా ఆఫర్లూ అందుతున్నాయి.
 


ప్రస్తుతం ఇటు సౌత్ చిత్రాలతో పాటు అటు బాలీవుడ్ లోనూ వరుసగా అవకాశాలను అందుకుంటోంది. విభిన్న పాత్రలతో అలరిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. పలు ఇంటర్వ్యూల్లోనూ మెరుస్తూ వస్తోంది. 

అయితే గతంలో మృణాల్ ఠాకూర్ బాడీ షేమింగ్ కు గురైనట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ‘మీరు అస్సలు సెక్సీగా లేరని’, ‘ఈ పల్లెటూరి అమ్మాయి ఎవరు? మరికొందరు బరువు తగ్గమని సలహాలిస్తూనే వచ్చారు’ అంటూ చెప్పుకొచ్చింది. 

ఇవన్నీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదుర్కొందని తెలిపింది. ఆ అనుభవాలను, ఆయా సందర్భాల్లో తనను ఉద్దేశించిన కామెంట్స్ ను వివరించింది.  ఏదేమైనా ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ సౌత్ లో బలంగా నాటుకుపోతోంది. అటు నార్త్ లోనూ మంచి అవకాశాలు అందుతున్నాయి. 

ఇక మృణాల్ ఠాకూర్ సినిమాల విషయానికొస్తే... చివరిగా ఈ ముద్దుగుమ్మ ‘హాయ్ నాన్న’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెక్ట్స్ విజయ్ దేవరకొండతో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంతో అలరించబోతోంది. రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ విడుదలై ఆకట్టుకుంటోంది. 

Latest Videos

click me!