మన శంకర వరప్రసాద్ గారు వారం రోజుల కలెక్షన్స్, 7 రోజుల్లో మెగా మూవీ ఎంత వసూలు చేసిందంటే?

Published : Jan 19, 2026, 10:55 AM IST

మెగాస్టార్  చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'  రిలీజ్ అయ్యి వారం రోజులు అవుతోంది.  బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా  దుమ్మురేపుతోంది. వసూళ్లలో తన హవా చూపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా 7వ రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే? 

PREV
15
సంక్రాంతి విన్నర్ గా నిలిచిన సినిమా..

70 ఏళ్ల వయసులో  చిరంజీవి కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా సత్తా చాటాడు మెగాస్టార్. ఆయన హీరోగా నటించని  'మన శంకర వరప్రసాద్ గారు' విడుదలైన మొదటి రోజు నుంచే సత్తా చాటుతోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విరిలీజ్అయ్యింది. సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. 

25
మన శంకర వరప్రసాద్ గారు' 7వ రోజు కలెక్షన్లు

'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా 7వ రోజు కలెక్షన్ల వివరాలు వెల్లడయ్యాయి. sacnilk.com ప్రకారం, ఈ సినిమా 7వ రోజున రూ.13.19 కోట్లు వసూలు చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద  153.44 కోట్ల నెట్ కలెక్షన్లు  సంపాదించింది.

35
ఒక్కొక్క రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

'మన శంకర వరప్రసాద్ గారు' ప్రీ-సేల్‌లో 9.35 కోట్లు సంపాదించింది. మొదటి రోజు 32.25 కోట్లు, రెండో రోజు 18.75 కోట్లు, మూడో రోజు 19.5 కోట్లు, నాలుగో రోజు 22 కోట్లు, ఐదో రోజు 19.5 కోట్లు, ఆరో రోజు 18.9 కోట్లు వసూలు చేసింది.

45
సంచలనం సృష్టిస్తోంది

'మన శంకర వరప్రసాద్ గారు' ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 261 కోట్లు వసూలు చేసిందని దర్శకుడు అనిల్ రావిపూడి ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ఈ వేగాన్ని చూస్తే త్వరలోనే 300 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు.

55
శంకర వరప్రసాద్ తో పాటు ఎవరెవరంటే?

దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'లో చిరంజీవితో పాటు నయనతార, వెంకటేష్, కేథరిన్ థెరిసా, జరీనా వహాబ్, హర్ష వర్ధన్, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఒక తెలుగు యాక్షన్ కామెడీ సినిమా. దీని బడ్జెట్ 150 కోట్లు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు.

Read more Photos on
click me!

Recommended Stories