జయప్రకాష్‌రెడ్డికి చిరు, మోహన్‌బాబు, పవన్‌, బాలకృష్ణ, రాజమౌళి సంతాపం..

First Published Sep 8, 2020, 1:45 PM IST

కామెడీ విలన్‌గా తెలుగు ఆడియెన్స్ కి కితకితలు పెట్టించిన జయప్రకాష్‌ రెడ్డి మరణం చిత్ర పరిశ్రమకి తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి అనేక మంది సినీ తారలు స్పందిస్తూ జయప్రకాష్‌రెడ్డికి తీవ్ర సంతాపం తెలిపారు. తాజాగా చిరంజీవి, మోహన్‌బాబు, రాజమౌళి, బాలకృష్ణ, అల్లు అర్జున్‌ వంటి ప్రముఖలు సంతాపం తెలిపారు. 

చిరంజీవి మాట్లాడుతూ, సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి అకాల మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు.జయప్రకాష్‌ రెడ్డి గారితో నేను ఆఖరిగా `ఖైదీ నెం. 150 ` సినిమాలో నటించా. ఆయన గొప్ప నటుడు. `నాటక రంగం తనకు కన్నతల్లి అని, సినీ రంగం తనని పెంచిన తల్లి అనేవారు. ఇప్పటికీ ఆయన శని, ఆదివారాల్లో సినిమా షూటింగ్‌లు మానుకుని స్టేజీ మీద నాటకాలు వేస్తుండేవారు. నన్ను కూడా రావాలని చాలా సార్లు అడిగారు. కానీ ఆ ఛాన్స్‌ని నేను పొందలేకపోయాను. తెలుగు సినిమాల్లో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌ కి ఓఇమేజ్‌ తీసుకొచ్చారాయణ. ఫ్యాక్షనిజమంటే ఆయన గుర్తొస్తారు. అందులోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైనబ్రాండ్‌ సృష్టించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతితెలియజేస్తున్నా` అని చిరంజీవి ట్విటర్‌ విచారం వ్యక్తం చేస్తూ నివాళ్లర్పించారు.
undefined
విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జయప్రకాష్‌ రెడ్డి పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తి అని, లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మించిన సినిమాల్లోఆయన ఎన్నో మంచి పాత్రలు పోషించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మోహన్‌బాబు. జయప్రకాశ్‌ రెడ్డి మరణవార్త తనని ఎంతగా బాధించిందన్నారు. నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నటకరంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ అనేక విలక్షణ పాత్రలు పోషించారని తెలిపారు.
undefined
నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ, జయప్రకాష్‌రెడ్డి తనకు అత్యంత ఆత్మీయులని, `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` వంటి ఎన్నో విభిన్న చిత్రాల్లో తామిద్దరం కలిసి నటించామని చెప్పారు. ఆయన రంగ స్థలం నుంచి వచ్చారు కాబట్టి, ఆయన సినిమా రంగాన్ని, నాటక రంగాన్ని రెండు కళ్ళులాగా భావించారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, నాటకాలు ప్రదర్శించేవారని, తమ ఇద్దరి మధ్య ఎంతో విశిష్టమైన అనుబంధం ఉంది. ఆయన లేకపోవడం దిగ్భ్రాంతిని కలిగిందని, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.
undefined
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ స్పందిస్తూ, ప్రముఖ నటుడు జయప్రకాష్‌ రెడ్డి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. రాయలసీమ మాండలికాన్ని పలకడంలో తనదైన బాణీని ఆయన చూపించారు. నాటక రంగం నుంచి వచ్చిన ఆయన ప్రతినాయకుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్గా ప్రేక్షకుల్ని మెప్పించారు. `గబ్బర్‌ సింగ్‌`లో పోలీస్‌ కమిషనర్‌గా నటించారు. పాత్ర ఏదైనా చక్కగా ఒదిగిపోయేవారు.తెలుగు సినీ, నాటక రంగాలకు ఆయన లేని లోటు తీరనిది` అని చెప్పారు.
undefined
స్లయిలీష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ చెబుతూ, జయప్రకాష్‌ రెడ్డిగారు లేరనే వార్త విని షాక్‌కి గురయ్యాను. తెలుగు చిత్ర పరిశ్రమ మరో అద్భుతమైన నటుడిని కోల్పోయింది. ఆయన ప్రతిభను గౌరవంగా, ఆరాధిస్తాను. అదే సమయంలో ఆయన థియేటర్ ఆర్టిస్ట్ లను, థియేటర్‌ గ్రూప్‌ని సపోర్ట్ చేస్తుంటారు. ఆయన నన్ను కూడా పలుమార్లు థియేటర్ ఆర్టిస్ట్ లకు సహాయం చేయమని తెలిపారు. ఏదో ఒక రోజు అది చేస్తాను. వారి ఫ్యామిలీకి నా ప్రగాఢసంతాపం` అని పేర్కొన్నారు.
undefined
ప్రకాష్‌ రాజ్‌ స్పందిస్తూ, సహచర నటుడు జయప్రకాష్‌ రెడ్డి హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది.నటనంటే ఆయనకు ప్రాణం. అటు వెండితెరపై, ఇటు స్టేజ్‌పై నాటకాలలోనూ పోషించిన పాతలకు ప్రాణం పోసిన నటుడాయన` అని ట్వీట్‌ చేశారు.
undefined
దర్శక ధీరుడు రాజమౌళి సంతాపం తెలిపారు. `ఆయన ఆకస్మిక మరణ వార్త నన్ను షాక్‌కి గురి చేసింది. ఇదిచాలా విషాదకరం. ఆయనతో కలిసి పని చేయడం గొప్ప అనుభూతుల్ని మిగిల్చింది. విలక్షణ నటన, మీదైన కామెడీ, విలనిజంతో దశాబ్దాలుగా మాకు వినోదం పంచినందుకు థ్యాంక్స్` అని ట్వీట్‌ చేశారు.
undefined
మాస్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ స్పందిస్తూ, `జయప్రకాష్ రెడ్డి లేరన్న వార్త విని షాక్‌కి గురయ్యాను. ఆయనంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చేసిన అన్ని సినిమాల్లో ఆయన నటించారు. అలాంటి మంచి వ్యక్తిని, మంచి నటుడిని కోల్పోవడం పర్సనల్‌గా నాకు తీరని లోటు` అని తెలిపారు.
undefined
నటుడు, `మా` తాత్కాలిక అధ్యక్షుడు బెనర్జీ మాట్లాడుతూ, జయప్రకాష్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు. చాలా సినిమాల్లో కలిసి నటించామన్నారు. ఆయన మంచి నటుడు, మంచి వ్యక్తి, స్నేహశీలని కొనియాడారు. ఆయనది చిన్న పిల్లల మనస్తత్వమన్నారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా నటించగల వ్యక్తని చెప్పారు. ఇంకా చెబుతూ, ``జయం మనదేరా` సినిమాలో జయప్రకాశ్ రెడ్డి,తాను, అశోక్ కుమార్, సత్యప్రకాష్‌ అన్నదమ్ములుగా నటించామని, అందుకోసం చాలా రోజులు కలిసి జర్నీచేశామన్నారు. జయప్రకాశ్ రెడ్డిని తాను డాడీ అని పిలిచేవాడనని బెనర్జీ చెప్పారు.
undefined
ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌ విజయ్‌ చందర్‌ స్పందిస్తూ, తెలుగు చిత్రపరిశ్రమలో తనదంటూ ఓ నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ లక్షలాది ప్రేక్షకుల మన్ననలు పొందిన విలక్షణ నటుడు జయప్రకాష్‌ రెడ్డి మరణం సినీ ప్రపంచానికి తీరని లోటన్నారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సినీ ప్రేక్షకులను ఉర్రుతలూగించి యాస, భావ వ్యక్తీకరణలో తనదంటూ ఒక శైలిని సృష్టించారని విజయ్ చందర్ తెలిపారు. జయప్రకాశ్ రెడ్డితో ఇండస్ట్రీలోతనకు కూడా మంచి అనుబంధం ఉండేదని ఆయనతో పరిశ్రమకు సంబంధించి అనేక అంశాలు తరచూ చర్చించేవారని ఎఫ్‌డిసి చైర్మన్ తెలిపారు.
undefined
click me!