చిరు ‘మాస్టర్’ మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా? ఇంతకీ ఆమె ఎక్కడున్నారంటే?

First Published | Feb 10, 2023, 2:20 PM IST

నటి రోషిణిని పేరు చెబితే గుర్తుపట్టడం కాస్తా కష్టమే కానీ.. మెగాస్టార్ చిరంజీవి నటించి ‘మాస్టర్’ హీరోయిన్ అంటే యాదికొస్తుంది. సినిమాలకు దూరంగా ఆమె ఇప్పుడెలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు. 
 

తెలుగు చలన చిత్రపరిశ్రమలో ఎంతో మంది నార్త్ హీరోయిన్లు మంచి గుర్తింపు దక్కించుకున్నారు. కొందరు ఏండ్లపాటు ఊపూపితే.. మరికొందరు మాత్రం రెండు, మూడు సినిమాలు చేసి కనుమరుగయ్యారు. 
 

ఈకోవలోకే వస్తుంది నటి రోషిణి (Roshini).తెలుగులో రెండు మూడు చిత్రాలకంటే ఎక్కువగా నటించలేదు. 1997లో విడుదలైన తమిళ కామెడీ చిత్రం ‘శిష్యా’తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 
 


అదే ఏడాది తెలుగులో విడుదలైన ‘మాస్టర్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ నటించింది. మాస్టర్ పాత్రలో నటించిన చిరంజీవికి ఫ్లాష్ బ్యాక్ లో జోడీగా అలరించింది. 

ప్రీతీరావు పాత్రలో ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘పవిత్ర ప్రేమ’,‘శుభలేఖ’ చిత్రాల్లో నటించి సినిమాలకు దూరమైంది. అయితే రోషిణి నటించిన చిత్రాలేవీ పెద్దగా హిట్ కాకపోవడంతో ఆఫర్లు కూడా తగ్గాయి. రెండేండ్లలో తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ నటించింది.
 

25 ఏండ్లు సినిమాలకు దూరమైన రోషిణి ప్రస్తుతం తన ఫ్యామిలీతో ముంబైలో స్థిరపడింది. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ప్రస్తుతం ఈమె కాస్తా లావైపోయారు. గుర్తుపట్టడం కష్టంగానే ఉంది. ఈక్రమంలో జ్యోతికి ఇటీవల తన సిస్టర్స్ తో దిగిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. 
 

అయితే, రోషిణి మరెవరో కాదు. హీరోయిన్, తమిళ స్టార్ సూర్య సతీమణి జ్యోతికకు సొంత చెల్లెలు. వీరు మొత్తం ముగ్గురు అక్కాచెళ్లెల్లు నగ్మ, జ్యోతిక, రోషిణి. వాళ్లిద్దరు సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జ్యోతిక ఇప్పటికీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనే అలరిస్తూనే ఉన్నారు. 
 

Latest Videos

click me!